ఇదిలా ఉంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో విజయాలు అందుకున్నారు వెంకీ. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు సౌందర్యతో చేసిన సినిమాలున్నాయి. వీరిద్దరి పెయిర్‌కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. వెండితెరపై జంటగానూ చూడముచ్చటగానూ ఉండేవాళ్లు. ఇద్దరు కలిసి ఐదారు సినిమాలు చేశారు. `రాజా`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `దేవిపుత్రుడు`, `జయం మనదేరా`, `పవిత్ర బంధం`, `పెళ్లి చేసుకుందాం`, `సూపర్ పోలీస్` వంటి సినిమాలు వచ్చాయి. చాలా వరకు మంచి విజయాలు సాధించాయి.