వెజ్‌ తినే రష్మిక.. నాన్‌ వెజ్‌ యాడ్‌.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నట్టు అంటూ రెచ్చిపోయిన ట్రోలర్స్

Published : May 14, 2023, 08:20 AM ISTUpdated : May 14, 2023, 09:12 AM IST

రష్మిక మందన్నా ఇప్పుడు ట్రోలర్స్ కి దొరికిపోయింది. ఆమె ఓ యాడ్‌ చేస్తూ నెటిజన్ల కంట పడింది. అందుకు కారణం ఆమె నాన్‌ వెజ్‌ యాడ్‌ చేయడమే. ఇదే ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది.   

PREV
16
వెజ్‌ తినే రష్మిక.. నాన్‌ వెజ్‌ యాడ్‌.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నట్టు అంటూ రెచ్చిపోయిన ట్రోలర్స్

స్టార్‌ డమ్‌ వచ్చాక సెలబ్రిటీలు యాడ్లు చేయడం కామన్‌. సినిమాల పారితోషికాలతోపాటు యాడ్స్ ఎక్స్ ట్రా ఇన్‌కమ్‌ సోర్స్  గా మారుతుంది. క్రేజ్‌, పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలతోనే కార్పొరేట్‌ కంపెనీలు యాడ్స్ చేస్తుంటాయి. అలా రష్మిక మందన్నా ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ కావడంతో ఆమె యాడ్‌ కంపెనీలకు హాట్‌ కేక్‌లా మారింది. ఆమె దాన్ని యూజ్‌ చేసుకుని నాలుగురాళ్లు వెనకేసుకుంటుంది. 

26

యాడ్స్ చేసే ముందు ఎవ్వరైనా కొన్ని మినిమమ్‌ లాజిక్స్ ఫాలో కావాలి, ఆ విషయంలో జాగ్రత్తగానూ ఉండాలి. డబ్బు యావలో పడి ఏది పడితే అది చేస్తే విమర్శలు తప్పవు. ఇప్పుడు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అలాంటి విమర్శలనే ఎదుర్కొంటుంది. ఏ సెలబ్రిటీ అయినా యాడ్‌ చేసే ముందు దాన్ని వాడి చూడాలని చెబుతుంటారు. కోర్టులు కూడా ఈ విషయాన్ని చెబుతుంటాయి. ప్రజలకు ఉపయోకరమైనది అయితేనే యాడ్‌ చేయాలని సూచనలు చేశాయి. కానీ కొంత మంది దాన్ని లెక్కచేయకుండా డబ్బుల కోసం యాడ్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నారు. రష్మిక విషయంలో అదే జరిగింది. 
 

36

`పుష్ప`తో పాన్‌ ఇండియా స్టార్‌ గా మారిన రష్మిక మందన్నా ఆ మధ్య ఓ ఫుడ్‌ కంపెనీ(మెక్‌ డోనాల్డ్) కి చెందిన యాడ్ చేసింది. అందులో చికెన్‌ లెగ్‌ పీస్‌లు తింటున్నట్టుగా ఉంది. ఆ రుచిని ఆస్వాదిస్తూ అద్భుతంగా ఉంది. ఆ డిలీషియస్‌ వాహ్‌ అంటూ అందరిని నోరూరుంచేలా చేసింది. ఈ యాడ్‌ బాగా పాపులర్‌ కూడా అయ్యింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఇది చక్కర్లు కొట్టింది. అదే సమయంలో ఇది ట్రోలర్స్ కి దొరికింది. దీంతో ఆడుకుంటున్నారు. 
 

46

మరి అందులో తప్పేముందనే డౌట్‌ రావచ్చు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా తాను వెజిటేరియన్‌ అని చెప్పింది. డైట్‌ కోసం వెజిటేరియన్‌గా మారానని వెల్లడించింది. ఆ వీడియో క్లిప్‌ని ఇప్పుడు షేర్‌ చేస్తూ, వెజిటేరియన్‌ అయిన రష్మిక, నాన్‌ వెజ్‌ ఫుడ్‌ యాడ్‌ చేయడమేంటి? అని, జనాలను ఇది తప్పుదోవ పట్టించడమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారని ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారా? అంటున్నారు. ఆ ఐటెమ్‌ ఎలా ఉందో కనీసం రుచి చూడలేని రష్మిక, జనాలను తినాలని ఎలా చెబుతుంది? అది బాగా లేకపోతే తను బాధ్యత వహిస్తుందా? అంటూ రచ్చ చేస్తున్నారు. 

56

దీంతో ఇప్పుడు రష్మిక ట్రోలర్స్ బారిన పడి హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ యాడ్‌ చాలా కాలం నుంచే చేస్తుంది రష్మిక. కానీ ఆమె తాను వెజిటేరియన్‌ అనే  వీడియో క్లిప్‌ ఇప్పుడు బయటపడడంతో చర్చనీయాంశం అవుతుంది. మరి దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిజానికి సెలబ్రిటీలు అంటే, ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు చేసే యాడ్స్ ని ఫ్యాన్స్, జనం చూస్తారు, వాటిని ఫాలో అవుతారు. అంతటి ప్రభావం చూపించే కెపాసిటీ వారి సొంతం. అలాంటిది ప్రజల నమ్మకాన్ని సెలబ్రిటీలు ఇలా తాకట్టుపెట్టే ప్రయత్నం తగదు అని అంటున్నారు క్రిటిక్స్. కనీసం స్వతహాగా వాడలేని వారు ప్రజలను వాడాలని చెప్పడం నైతికత కాదని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడిది నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

66

ఇక రష్మిక మందన్నా కెరీర్‌ పరంగా చూస్తే ఆమె ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తుంది. దీంతోపాటు `రెయిన్‌ బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేస్తుంది. అలాగే హిందీలో `యానిమల్‌` మూవీలో నటిస్తుంది. షాహిద్‌ కపూర్‌తో మరో సినిమాకి ఓకే చెప్పిందట. మరో ప్రాజెక్ట్ కూడా చర్చల దశలో ఉందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories