మేకప్‌ లేకుండా అసలైన అందం చూపిస్తూ జిమ్‌లో చెమటలు కారుస్తున్న అనసూయ.. వర్కౌట్‌ లుక్‌లో యమ హాట్‌గా రంగమ్మత్త

Published : May 14, 2023, 07:09 AM IST

అనసూయ భరద్వాజ్‌ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో తరచూ చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారుతుంది. ఆమె విజయ్‌ దేవరకొండపై చేసిన కామెంట్ అనేక మలుపులు తిరుగుతుంది.

PREV
16
మేకప్‌ లేకుండా అసలైన అందం చూపిస్తూ జిమ్‌లో చెమటలు కారుస్తున్న అనసూయ.. వర్కౌట్‌ లుక్‌లో యమ హాట్‌గా రంగమ్మత్త

ఓ వైపు వివాదాలతో సోషల్‌ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే మరోవైపు అందాల ఫోటోలతో ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల పెద్దగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేయని అనసూయ.. జిమ్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది. మేకప్‌ లేకుండా అసలైన అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటుంది. 

26

తాజాగా మరోసారి తన మేకప్‌ లేకుండా లుక్‌ని పంచుకుంది. ఇందులో జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ చెమటలు కారుస్తుంది. క్లోజ్‌ సెల్ఫీలో అసలైన అందాన్ని ఆవిష్కరించింది అనసూయ. ఈ భామ మేకప్‌ లేకపోయినా అంతే అందంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఆమె మరింత హాట్‌గానూ ఉండటం విశేషం. 

36

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్న ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అనసూయ చాలా అరుదుగా ఫోటో షూట్లు చేస్తుంది. దీంతో ఇలా వర్కౌట్‌ ఫోటోలతో అలరిస్తుంది. అదే సమయంలో తన ఫిట్‌నెస్‌ని పెంచుకుంటుందీ హాట్‌ యాంకర్‌. 
 

46

దాదాపు తొమ్మిదేళ్లు `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేసిన అనసూయ అనూహ్యంగా గతేడాది ఈ షో నుంచి తప్పుకుంది. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, బాడీ షేమింగ్‌ కామెంట్ల, నిర్వాహకులతో ఏర్పడిన బేధాభిప్రాయాలతో తాను తప్పుకున్నట్టు చెప్పింది. పిల్లలు పెద్ద అవుతున్నారు, వారికి అన్ని  అర్థమవుతున్నాయని, ఓ తల్లిగా కేరింగ్‌ కోసం తప్పుకున్నట్టు చెప్పింది. 
 

56

అయితే ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితమయ్యింది అనసూయ. టీవీ షోస్‌ అంటే ప్రతి వారం బిజీగా ఉండేది. సినిమాలు కాబట్టి కొన్ని రోజులే షూటింగ్‌ ఉంటుంది. మిగతా టైమ్‌ అంతా ఖాళీనే. దీంతో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తుంది. ఎక్కవగా ఫిట్‌నెస్‌ పెంచుకునే పనిలో పడింది. అందుకే తరచూ వర్కౌట్స్ చేస్తూ, ఆయా ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. వారిని అలరిస్తుంది. 
 

66

అనసూయ ఆ మధ్య విజయ్‌ దేవరకొండ సినిమాపై పరోక్షంగా చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. విజయ్‌ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. దాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంది అనసూయ. తాను సింగిల్‌గా పోరాడానని, వారంతా పదుల్లో ఉన్నారని, అయినా బెదిరేది లేదని స్పష్టం చేసింది. స్ట్రాంగ్‌ కౌంట్లరిస్తూ తానేంటో చూపించింది. అయితే మరికొంత మంది మాత్రం అనసూయ కి ఎందుకు ఇలాంటివన్నీ అంటూ సెటైర్లు పేలుస్తుండటం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories