Veerabhadrudu Review: వీరభద్రుడు (కరుప్పు) మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. సూర్య సినిమాకి దారుణమైన టాక్‌

Published : May 14, 2026, 01:31 PM IST

karuppu review: సూర్య, త్రిష జంటగా నటించిన చిత్రం `కరుప్పు`(వీరభద్రుడు). ఈ మూవీ నేడు గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
15
నేడే కరుప్పు విడుదల

సూర్యకి ఒక్క హిట్‌ పడితే, నాలుగైదు పరాజయాలు వెంటాడుతున్నాయి. `జైభీమ్‌` తర్వాత సాలిడ్‌ హిట్‌ లేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హిట్‌ కొట్టేందుకు వస్తున్నారు సూర్య. ఆయన `కరుప్పు` చిత్రంలో నటించారు. దీన్ని తెలుగులో `వీరభద్రుడు` పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. అంతేకాదు కీలక పాత్రలో కూడా నటించాడు. అలాగే లేటెస్ట్ సెన్సేషన్‌ త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి.

25
వీరభద్రుడు ట్విట్టర్‌ రివ్యూ

ఈ మూవీ ట్విట్టర్‌ రివ్యూ వచ్చింది. ఓవర్సీస్‌లో దీన్ని ఇప్పటికే ప్రదర్శించారు. మధ్యాహ్నం నుంచి తెలుగులోనూ షోస్‌ పడుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ, ట్విట్టర్‌ రివ్యూ వచ్చింది. సినిమాకి మెయిన్‌గా నెగటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే షోస్‌ పడ్డ నేపథ్యంలో ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు నెటిజన్లు. ఇందులో మూవీ బాగా లేదని, రొటీన్‌ కమర్షియల్‌ మూవీ అని, చాలా లౌడ్‌గా ఉందని అంటున్నారు. దర్శకత్వం, స్క్రీన్‌ ప్లే చాలా బోరింగ్‌గా ఉందని చెబుతున్నారు. సూర్య యాక్టింగ్‌ కూడా ఓవర్‌గా అనిపిస్తుందని, అరుపులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. త్రిష కాసేపు కనిపిస్తుందని, ఆమె పాత్ర కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని చెబుతున్నారు. అన్నింటికంటే బీజీఎం చాలా దారుణంగా చెబుతున్నారు.

35
సూర్య సినిమాకి దారుణమైన టాక్‌

సినిమా మాస్‌, యాక్షన్‌ గా సాగుతుందని, టీజర్‌,ట్రైలర్‌లో చూపించారు. కానీ ఇది మెయిన్‌గా కోర్ట్ రూమ్‌ డ్రామాగా సాగుతుందట. అయితే మరీ బాగుందని చెప్పలేం గానీ, ఫర్వాలేదని, మీరు డిజాప్పాయింట్‌ కారు అని మరికొందరు చెబుతున్నారు. కానీ  చాలా వరకు సినిమా మాత్రం దారుణం అంటున్నారు. సూర్యకిది బ్యాడ్‌ ఛాయిస్‌ అని, ఆర్‌జే బాలాజీ ఏమాత్రం న్యాయం చేయలేకపోయారని అంటున్నారు. సూర్యకిది పెద్ద డిజాస్టర్‌ సినిమా అని, ఇది `కంగువా` కంటే దారుణంగా ఉందని, క్రింజ్‌ లెవల్‌ డైరెక్షన్‌ అని చెబుతున్నారు. సూర్య యాక్టింగ్‌ కూడా ఇబ్బంది పెట్టేలా ఉంటుందట.

45
కోర్ట్ రూమ్‌డ్రామా

సినిమా ఫస్టాఫ్‌ అంతా కోర్ట్ రూమ్‌ డ్రామా చుట్టూ తిరుగుతుందట. ఎమోషనల్‌గా ఉంటుందట.సెకండాఫ్‌ మాస్‌ ఎలిమెంట్లు, హ్యూమర్‌, ఫన్‌ ఇలా అన్ని మిక్స్ అయి ఉంటుందట. ఇందులో సూర్య ఎంట్రీ వరస్ట్ గా ఉంటుందట. సూర్య క్రింజ్‌ వేరే లెవల్ అని, బోరింగ్‌ గా స్క్రీన్‌ ప్లే సాగుతుందట. ఎమోషనల్‌గా మూవీ కనెక్ట్ కాలేకపోతుందట. పాత కథ అని, పాటలు కూడా ఔట్‌ డేటెడ్‌గా ఉన్నాయని, ఏమాత్రం కొత్తగా, ఆకట్టుకునేలా లేదని అంటున్నారు.

55
షోస్‌ క్యాన్సిల్‌

సినిమాలో ఏదైనా ప్లస్‌ ఉందంటే అది కేవలం వీఎఫ్‌ఎక్స్ మాత్రమే అంటున్నారు. మొత్తంగా `కరుప్పు`(వీరభ్రదుడు) మాత్రం డిజాస్టర్‌ అని అంటున్నారు. అయితే ఇప్పటికే చాలా షోస్‌ క్యాన్సిల్‌ అవుతున్నాయి. కొన్ని టెక్నీకల్‌ ఇష్యూస్‌తో మూవీ ఆపేస్తున్నారట. దీనికితోడు నెగటివ్‌ టాక్‌ కూడా సినిమాపై గట్టి ప్రభావం పడబోతుంది. సూర్య కెరీర్‌లోనే ఈ స్థాయిలో నెగటివ్‌ టాక్‌ ని అందుకున్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories