Ennenno Janmala Bandham: మాళవిక చెంప చెల్లుమనిపించిన వేద.. భ్రమరాంబికపై సీరియస్ అయిన మాళవిక?

First Published Feb 1, 2023, 12:36 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో అందరూ ముగ్గులు వేస్తూ ఉండగా ఏమైపోతుంది కేవలం రెండు నిమిషాలు ఉంది అనడంతో వేద టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు ఖుషి అమ్మ తొందరగా ముగ్గులు వేయమ్మా టైం అయిపోతుంది మళ్లీ డిస్క్వాలిఫై చేస్తారు అనడంతో అప్పుడు వేద అయ్యో పింక్ కలర్ అయిపోయింది అనుకుంటూ ఉంటుంది. అది చూసిన మాళవిక వేద ఎట్టి పరిస్థితుల్లోనూ వేద గెలవకూడదు అనుకుంటూ ఉంటుంది. వేద గెలిస్తే నేను ఓడిపోయినట్టే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఖుషి, విన్నీ ఇద్దరూ రంగులు తీసుకుని రావడానికి వెళ్తారు. అప్పుడు వేద టెన్షన్ పడుతూ ఉండగా యష్ ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ముగ్గులు వేస్తూ ఉంటారు.
 

అప్పుడు మాళవిక ఖుషి రంగు తీసుకొనివచ్చేటప్పుడు రంగుని వేద ముగ్గు మీద పడేలా చేస్తే ముగ్గు మొత్తం పాడవుతుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఖుషి కలర్ తీసుకొని వస్తుండగా మాళవిక కావాలని అడ్డు వెళ్లి కాలు అడ్డు పెడుతుంది. అప్పుడు అమ్మ అని ఖుషి గట్టిగా అరవడంతో వెంటనే వేద వెళ్లి ఖుషిని గట్టిగా పట్టుకొని ఏం కాలేదమ్మా భయపడకు అని ఓదారుస్తూ ఉంటుంది.  అప్పుడు వేద ఖుషికి ధైర్యం చెబుతూ ఉండగా అందరూ ఏం కాదు ఖుషి ధైర్యంగా ఉండు అని అంటారు. ఖుషి ఏడుస్తూ ఉండగా అందరూ ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు మాళవిక అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సులోచన ఆగు అని అంటుంది. ఏం చేసావు నువ్వు అనడంతో నేనేం చేశాను అని అనగా ఖుషిని పడేసావు అనడంతో అందరూ షాక్ అవుతారు.
 

నువ్వు పడేయడమేంటి మాళవిక అనే భ్రమరాంబిక అడగడంతో కాలేదు అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు వదిన అనగా  ఏయ్ అబద్ధాలు చెప్పకు ఖుషి పరిగెడుతున్నప్పుడు నువ్వు కాలు అడ్డుపెట్టి పడేయడం నాకల్లారా నేను చూశాను అంటుంది సులోచన. అసలు సిగ్గుందా నువ్వు ఆడదానివేనా అని సులోచన తిట్టడంతో భ్రమరాంబిక కూడా మాళవిక మీద సీరియస్ అవుతుంది. పిల్లల మీద జాలి లేదా అని భ్రమరాంబిక అనడంతో ఆ పిల్లల మీద జాలి ఉంటే ఈవిడ బ్రతుకు ఎందుకు ఎలా తయారవుతుంది అనడంతో మర్యాదగా మాట్లాడండి అంటుంది మాళవిక. ఊరుకుండే కొద్ది రెచ్చిపోతున్నారు ఖుషి నా కూతురు అనడంతో నీ కూతురు అయితే నా కూతురు వేద దగ్గర ఎందుకు ఉంటుంది అని అంటుంది సులోచన. 

నీ పెంపకమే సరిగ్గా ఉంటే నీ కొడుకు నీ దగ్గర ఉండకుండా బాల నేరస్తుడిగా నేరం చేసి జైల్లో ఎందుకు ఉంటాడు అనడంతో ఏం కూసావు అని సులోచనను కొట్టబోతుండగా వేద అడ్డుపడి మాళవిక చెంప చెల్లుమనిపిస్తుంది. టైం బాగుంది కాబట్టి సరిపోయింది మా అమ్మ అడిగిందంట తప్పేముంది నేను రాకపోయి ఉంటే ఖుషి పరిస్థితి ఏమై ఉండేది నా బిడ్డకు ఏమైనా జరిగి ఉంటే అని వేద అనడంతో నీ బిడ్డ ఏంటి బిడ్డ ఖుషి నా బిడ్డ అంటుంది మాళవిక. ఆ మాట విని భ్రమరాంబిక షాక్ అవుతుంది. ఛీ నోరు ముయ్యి ఇంకొక్క కూత కుశావంటే మర్యాదగా ఉండదు చెబుతున్న అంటుంది మాలిని. నువ్వు కన్న తల్లివా ఖుషి నీ కూతురా ఆ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటుంది సులోచన.

అప్పుడు మాళవిక ఆపండి ప్రతి ఒక్కరు లెక్చరర్ ఇచ్చేది అసలు ఏంటి మీ మర్యాద గౌరవం అని అందరిని నిలదీస్తుంది. అప్పుడు భ్రమరాంబ పక్కన ఉన్న విషయం మరిచిపోయి నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో తప్పు మాట్లాడుతున్నావ్ మాళవిక అంటుంది భ్రమరాంబిక. తప్పు చేసావు మాళవిక క్షమించండి.. మాళవిక తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను అనడంతో నోరు ముయ్యి ఎవరు నువ్వు అని భ్రమరాంబిక మీద సీరియస్ అవుతుంది మాళవిక. తప్పుడు పని చేసింది నువ్వు కావానే ఇక్కడికి తీసుకొని వచ్చావు అంటుంది. నువ్వు తేనె పూసిన కత్తివి గతిలేక నీ పంచన ఉంటాను నీ గురించి తెలియదు అనుకుంటున్నావా అని సీరియస్ అవుతుంది మాళవిక. చిటిక వేసి ఏ ఒక్కరిని వదలను అందరి అంతు తేలుస్తాను.
 

అప్పుడు వేద ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగా మాళవిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వేద ఖుషిని హత్తుకుని బాధపడుతూ ఉంటుంది. తర్వాత కైలాష్ అభి దగ్గరికి వెళ్లి మన ఇంట్లో ఈ రోజు నైట్ కి రెండు ఆత్మహత్యలు జరగబోతున్నాయి అని జరిగింది మొత్తం వివరించడంతో అభి నవ్వుతూ ఉంటాడు. నవ్వుతున్నావు ఏంటి బ్రో అనడంతో ఈరోజు పార్టీకి నీతో పాటు నన్ను కూడా పిలుచుకొని వస్తాను నువ్వు లేకపోతే ఇక్కడ అలాంటివి ఏమీ జరగవు అని అంటాడు అభి. అప్పుడు సరే అని అభి కైలాష్ ఇద్దరు పార్టీకి వెళ్తారు. మరొకవైపు ముగ్గుల పోటీ ముగియడంతో బ్రమరాంబిక ముగ్గుల పోటీలో విజేతగా వేదని ప్రకటిస్తుంది. అప్పుడు వేద, భ్రమరాంబిక చేతులు మీదుగా గిఫ్ట్ అందుకుంటుంది.
 

అప్పుడు వేద మాట్లాడుతూ నేను ఈ పోటీలో పాల్గొనడానికి కారణం,ఈ పోటీని గెలవడానికి కారణం అని వేద గ్యాప్ ఇవ్వడంతో యష్ తన పేరు చెబుతుంది అని యష్ ఆశపడుతూ ఉండగా అప్పుడు వేద పిన్ని పేరు చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉండగా యష్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వేద వేసిన అమ్మతనం ముగ్గు గురించి గొప్పగా వివరిస్తూ ఉంటుంది.

click me!