ఈరోజు ఎపిసోడ్ లో ఝాన్సీ చెప్పండి యశోదర్ మాళవిక ఎవరితో ఉన్నారు అని అడగగా నాతోనే ఉంది అంటూ యష్ అబద్ధం చెప్పడంతో మాలిని వేద ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు యష్ ఆదిత్య అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. ఆరోజు ఆ టైంలో మాళవిక నేను ఇద్దరం కలిసే ఉన్నాము అని అంటాడు యష్. అప్పుడు మాలిని యష్ కి ఏమయింది ఎందుకు సొంత వాళ్ళని కాదని దీనికి సపోర్ట్ చేస్తున్నాడు ఏమైంది వీడికి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఝాన్సీ ఎందుకు కలిశారు ఎక్కడ కలిశారు మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.