ప్రభాస్‌కి జాకీ చాన్‌ యాభై కోట్ల ఆఫర్‌.. తిరస్కరించిన డార్లింగ్‌.. ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు

Published : Nov 30, 2022, 11:05 AM ISTUpdated : Nov 30, 2022, 11:08 AM IST

డార్లింగ్‌కి ఏడేళ్ల క్రితమే గ్లోబల్‌ ఆఫర్‌ వచ్చిందట. చైనా సినిమాకి దిక్సూచీగా నిలిచే జాకీ చాన్‌.. ప్రభాస్‌ కోసం ప్రయత్నించారట. `బాహుబలి` సినిమాని చూసిన ఆయన అందులో ప్రభాస్‌ నటనకు, బాడీ లాంగ్వేజ్‌కి ఫిదా అయి ఆయనతో సినిమా చేయాలని భావించారట.

PREV
16
ప్రభాస్‌కి జాకీ చాన్‌ యాభై కోట్ల ఆఫర్‌.. తిరస్కరించిన డార్లింగ్‌.. ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు

ఇండియన్‌ బాహుబలి ప్రభాస్‌(Prabhas) ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా మారబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు సక్సెస్‌ అయితే వరల్డ్ బిగ్గెస్ట్ యాక్టర్స్ లో ప్రభాస్‌ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ప్రపంచ సినిమాకి ఇండియన్‌ నుంచి రిప్రజెంట్‌ చేసే నటుడిగానూ ప్రభాస్‌ నిలుస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

26

అయితే డార్లింగ్‌కి ఏడేళ్ల క్రితమే గ్లోబల్‌ ఆఫర్‌ వచ్చిందట. చైనా సినిమాకి దిక్సూచీగా నిలిచే జాకీ చాన్‌(Jackie Chan).. ప్రభాస్‌ కోసం ప్రయత్నించారట. `బాహుబలి`(Bahubali) సినిమాని చూసిన ఆయన అందులో ప్రభాస్‌ నటనకు, బాడీ లాంగ్వేజ్‌కి ఫిదా అయి ఆయనతో సినిమా చేయాలని భావించారట. అంతేకాదు ఓ సినిమాకి ఆఫర్ కూడా చేశారట. 
 

36

ప్రభాస్‌తో మార్షల్‌ ఆర్ట్స్ సినిమా చేయాలని, సినిమాలో సెకండ్‌ హీరో తరహా పాత్రలో నటించాల్సి ఉంటుందని కృష్ణంరాజుని అప్రోచ్‌ అయ్యారట జాకీ చాన్‌. సినిమాలో తనని కాపాడే పాత్ర అది, ప్రభాస్‌ చేస్తే బాగుంటుందని జాకీ చాన్‌ చెప్పారట. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ చేస్తే యాభై కోట్లు రెమ్యూనరేషన్‌ ఇస్తానని చెప్పారడ జాకీ చాన్‌. కానీ ప్రభాస్‌ నో చెప్పారట. 
 

46

అందుకు కారణం డేట్స్ ఇష్యూ అని తెలిపారు కృష్ణంరాజు(Krishnam Raju). `బాహుబలి` మొదటి భాగం రిలీజ్‌ అయ్యింది. `బాహుబలి 2` చేయాల్సి ఉంది. ప్రభాస్‌ డేట్స్ అన్ని రేండేళ్ల వరకు రాజమౌళి లాక్‌ చేశాడు. దీనికితోడు అదే సమయంలో సుజిత్‌తో `సాహో` సినిమాకి కమిట్‌ అయ్యాడు ప్రభాస్‌. ఆల్మోస్ట్ మూడేళ్ల వరకు ప్రభాస్‌ డేట్స్ లేవు. మధ్యలో వెళితే `బాహుబలి 2` షూటింగ్‌ డిస్టర్బ్ అవుతుంది. లుక్స్ అన్నీ పోతాయి. మళ్లీ చాలా టైమ్‌ పడుతుంది. దీంతో నిర్మొహమాటంగా జాకీ చాన్‌ ఆఫర్‌ని తిరస్కరించారట ప్రభాస్‌. 
 

56

కృష్ణంరాజు ఓ టీవీ ఇంటర్వ్యూలో చాలా రోజుల క్రితం ఈ విషయాన్ని తెలిపారు. తాజాగా ఆ ఇంటర్వ్యూలోని ఈ క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులు దాన్ని షేర్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అప్పుడే ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు ప్రభాస్‌ రేంజ్‌ వేరేలా ఉండేదని కొందరు అంటుంటే, ఇండియన్‌ సినిమాలతోనే, తెలుగు సినిమాలతోనే గ్లోబల్ స్టార్‌గా ప్రభాస్‌ ఎదగడం ఖాయమని మరికొందరు అభిమానులు అంటున్నారు. మొత్తానికి ఈ వార్త అభిమానులను ఖుషీ చేస్తుందని చెప్పొచ్చు. 

66

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. `ఆదిపురుష్‌` షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది. సీజీ వర్క్ జరుపుకుంటుంది. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రభాస్‌ గత కొంత కాలంగా మోకాలు గాయంతో బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌ కోసం తరచూ ఆయన అమెరికా వెళ్లొస్తున్నారు. అయితే ఇప్పుడది పూర్తిగా తగ్గిపోయిందని తెలుస్తుంది. దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. డిసెంబర్ 1 నుంచి `ప్రాజెక్ట్ కే`, డిసెంబర్‌ 3వ వారం నుంచి `సలార్‌` చిత్రీకరణలో పాల్గొననున్నారని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories