Ennenno Janmala Bandham: వేద, యష్ మధ్య రొమాంటిక్ సీన్.. సంతోషంలో రాజారాణి?

Published : Jan 03, 2023, 01:55 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
17
Ennenno Janmala Bandham: వేద, యష్ మధ్య రొమాంటిక్ సీన్.. సంతోషంలో రాజారాణి?

ఈరోజు ఎపిసోడ్ లో వేద యష్ రాసిన లెటర్ చదువుతూ ఉంటుంది. అప్పుడు యష్ తన ఒడిలో పడుకొని ఆ లెటర్ ని మొత్తం చదివి వినిపించినట్టుగా వేద ఊహించుకుంటూ ఉంటుంది. లెటర్ లో యష్ గాజులు, కాళ్ల పట్టీలు తీసేస్తున్నావు అనడంతో మరి నీకేమైంది అవి ఉండటం వల్ల మాకు నిద్ర రాలేదు అని అనుకుంటూ ఉంటుంది వేద. అప్పుడు వేదా నాకు ఇప్పటినుంచి కాదు డాక్టర్ కాకముందు నుంచి ఇదే అలవాటు ఉంది అయినా మీకేంటి  అని అనడంతో అప్పుడు పక్కనే ఉన్న నాగేష్ నేను చెప్పి ఎంతవరకు పూర్తిగా విను అంటూ నీ చేతి గాజులు గల్లుమంటుంటే ఆ శబ్దం హాయిగా అనిపిస్తుంది అని అంటాడు.

27

 కాబట్టి బెడ్రూంలోకి రాగానే వాటిని తీసేయొద్దు అనడంతో వేద నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు గజ్జలు వేసుకుని నడుస్తూ వస్తుంటే గజ్జల గుర్రంలా ఉంటావు అనడంతో అప్పుడు వేద నన్ను పట్టుకుని గజ్జల గుర్రం అంటావా అని ఆ లెటర్ పై కోప్పడుతూ ఉంటుంది. ఆ పేపర్ వైపు చూస్తూ మీ సంగతి చెప్తాను నీ సంగతి అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పనిమనిషి వస్తుంది. అమ్మ మీకోసం ఆరు బయట మంచం అవి సిద్ధం చేయించాము అనడంతో మాకెందుకు బెడ్ రూమ్ ఉంది కదా అనడంతో అది కాదమ్మా పల్లెటూర్లో ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటే ఆహాయే వేరు అని అంటుంది.
 

37

అప్పుడు పని మనిషితో పాటు వేద కూడా సిగ్గుపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాజా బుక్  చదువుతూ ఉండగా ఇంతలో రాణి అక్కడికి వస్తుంది. ఇప్పుడు రాణిని చూసి నువ్వు మొదట్లో శోభనం గదిలోకి పాల గ్లాస్ తో వచ్చినట్టుగానే ఇప్పటికీ అలాగే ఉన్నావు అనడంతో రాని చాలు రాజా వెటకారంగా మాట్లాడింది అని అంటుంది. నీకు వయసు పెరిగింది కానీ మనసు మాత్రం ఇంకా యవ్వనంలో ఉంది అనడంతో కరెక్ట్ గా చెప్పావు గాని అని అంటాడు. ఆ తరువాత వాళ్ళు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ సరదాగా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు.

47

 మరొకవైపు యష్ ఆరు బయట పడుకుని సిటీలో అందరూవల్ల మామయ్య అత్తగారి ఇళ్ల కు పల్లెటూర్లకు వెళ్లాలంటే ఎందుకు అంత ఆనందపడతారో ఇప్పుడు అర్థం అవుతుంది. వేద వాళ్ళ తాతగారు వాళ్ళు చేసే మర్యాదలు, చేసిన పిండి పంటలు అన్ని తలుచుకుంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలా అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ వెన్నెల రాత్రి ఈ ఆరు బయట పడుకుంటే ఈ అనుభూతి అద్భుతంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఈ విషెస్ న్యూసెన్స్ ఎక్కడికి వెళ్లింది ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటాడు యష్.
 

57

అప్పుడు వేద పట్టీలు వేసుకొని ముస్తాబయి రెడీ అయి అక్కడికి రావడంతో ఆ పట్టీల శబ్దం విన్న యష్ వేదవైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వేద అందంగా రెడీ అవడం చూసి యష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. యష్ కన్నార్పకుండా వేద వైపు అలాగే చూస్తుండగా వేద సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి కొత్త అవతారం అనడంతో అమ్మమ్మ వద్దంటున్నా ఇలా రెడీ చేసింది అని అంటుంది వేద. ఎలా ఉన్నాను అనడంతో బాబు గారి బొమ్మలా ఉన్నావు అని అంటాడు యష్. ప్రతిరోజు ఇలాగే రెడీ అవ్వొచ్చు కదా అనగా మీకేంటి బాబు ఎన్నైనా చెబుతారు అని అంటుంది వేద. ఈ భూమి మీద ఆ దేవుడు అద్భుత సృష్టి ఏంటో తెలుసా మీ ఆడవాళ్లే అని అంటాడు.
 

67

అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వేద పాలు ఇవ్వడంతో యష్ కొన్ని తాగి కొన్ని వేదకు ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే చాలా బాగుంటుంది అని యష్ అనడంతో ఎందుకు అని అడగగా ఈ చల్లని రాత్రి పండువెన్నెలలో ఈ హాయి ఇలాగే ఉంటే బాగుంటుంది అనగా అవును చాలా బాగుంటుంది అని అంటుంది వేద. సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకే మంచంలో పడుకోవాలి అని అనడంతో ఇద్దరు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడువాళ్ళిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
 

77

ఆ తర్వాత యష్ వేద ఇద్దరు కలిసి ఒకే మంచంలో పడుకుంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు నిద్ర పట్టక మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరు మంచంలో ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వేద యష్ తో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు యష్ వేద వైపు చూస్తూ ఈరోజు నువ్వు నాకు చాలా పెద్దగా కనిపిస్తున్నావు అనడంతో వేద సిగ్గుపడుతూ ఉంటుంది.

click me!

Recommended Stories