Ennenno Janmala Bandham: గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద.. ఫుల్ గా తాగొచ్చిన యష్?

Published : Nov 15, 2022, 12:44 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 15 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
15
Ennenno Janmala Bandham: గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద.. ఫుల్ గా తాగొచ్చిన యష్?

ఈరోజు ఎపిసోడ్లో వేద ఖుషిని గట్టిగా ఎత్తుకొని ఏడుస్తూ అయిపోయిందమ్మా ఇంక అంతా అయిపోయింది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఇకనుంచి వెళ్ళిపోవాలి అని ఖుషిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు యష్ పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో యష్ గట్టిగా కోపంతో అరుస్తూ నీకు ఎలా చెప్పాలి కదా అని అంటాడు. మరొకవైపు వేద కారులో వెళుతూ జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. యష్ కూడా ఫుల్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.

25

మరొకవైపు సులోచన వేద కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమె భర్త వచ్చి నువ్వు భయపడకు సులోచన వేద చిన్నపిల్ల కాదు కదా వస్తుందిలే అని ధైర్యం చెబుతాడు. అప్పుడు అతను తినమని చెప్పినా కూడా సులోచన మాత్రం వేద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఎప్పుడూ లేనిది ఎందుకు వేదా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు సులోచన అనడంతో ఏమో తెలియదండి ఎప్పటిలాగా కాకుండా ఈరోజు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది అని అంటుంది. అప్పుడు సులోచన వేద గురించి తలుచుకొని బాధపడుతూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
 

35

 మరొకవైపు కారులో వస్తూ వేద జరిగిన విషయాలను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మాలిని వాళ్ళు కూడా వేద కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు వేద ఎమోషనల్ అవ్వడంతో ఏం జరిగింది వేద ఎందుకు ఏడుస్తున్నావు అని మాలిని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది వేద. అప్పుడు వేద ఎమోషనల్ అవుతుంది మీ అబ్బాయి నా దగ్గర ఒక నిజం దాచాడు అనడంతో ఏంటి వేద ఆ నిజమని మాలిని అడుగుతుంది.
 

45

అప్పుడు మాలిని ఎంత అడిగినా చెప్పకుండా నేను లోపలికి వెళ్తాను అంటూ ఎమోషనల్ అవుతూ లోపలికి వెళ్ళిపోతుంది వేద. అప్పుడు మాలిని ఆమె భర్త ఇద్దరూ ఏం జరిగి ఉంటుంది ఎందుకు ఇంతలా ఏడుస్తుంది యష్ ఏ నిజం దాచాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కంచు ఆమె భర్తకు ఫోన్ చేసి యష్ ఇంటికి రాలేదు నాకు భయంగా ఉంది అనడంతో అతను మాత్రం నవ్వుతూ ఉంటాడు. మరొకవైపు వేద ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే యష్ ఫుల్ గా తాగి వస్తాడు.

55

వాచ్మెన్ తో గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు యష్ మందు తాగుతూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే అది చూసిన మాలిని దంపతులు ఆశ్చర్యపోతాడు. అప్పుడు యష్ మాటలు విన్న మాలిని దంపతులు బాధపడుతూ ఉంటారు. యష్ గొంతు విన్న వేద అక్కడికి వచ్చి చూడడంతో యష్ గొడవ చేస్తూ ఉండగా అది చూసి ఆశ్చర్య పోతుంది.

click me!

Recommended Stories