Published : Nov 15, 2022, 12:17 PM ISTUpdated : Nov 15, 2022, 12:40 PM IST
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతోనే కాకుండా.. పలు సేవా కార్యక్రమాలతోనూ తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారి గురించే కాకుండా.. సమాజం పట్ల కూడా ఆలోచించేవారు.
చిత్ర పరిశ్రమలో ఒక సంచనంగా మారిన కృష్ణ.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతల హీరోగా, రికార్డుల గనిగా, చక్కని రూపసిగా తెలుగు గడ్డపై చెరగని ముద్ర వేసుకున్నారు. 360 చిత్రాల్లో నటించి చిత్రసీమలో తనదైన శైలిని చూపించారు.
26
చివరికి.. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) తీవ్ర విషాదాన్ని నింపారు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడవటంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో సినీ ప్రముఖు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కృష్ణ చేసిన సాహసాలు, ప్రయోగాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు.
36
ఈ సందర్భంగా కృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ వెలుగులోకి వచ్చింది. కృష్ణ నటన పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ తెలుగు ప్రజలతో ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు. ఇండస్ట్రీలోనే కాకుండా.. సమాజం ఎదుర్కొనే పలు సమస్యలపైనా స్పందించేవారు. ఆర్థిక సాయంతో పాటు, పలు సేవా కార్యక్రమాలతో పేదలను ఆదుకునేవారంట.
46
1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో కృష్ణ బాధితులకు అండగా నిలిచారు. వరద బాధితులకు రూ.10 వేల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేసేందుకు రూ.లక్ష వరకు ఆరోజుల్లోనే ఖర్చు చేశారు. అందుకే కృష్ణను ప్రజల మనిషిగాను కొనియాడారు.
56
అదేవిధంగా.. ఒక ఏడాది పాటు తుఫాను బాధితులను అదుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ తన ఆదాయంలో 10 శాతం కేటాయించారు. ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. స్వయంగా తాను బాధితులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పాడంట. అలాగే ప్రజలను చైతన్య పరిచేందుకూ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం, సహకరించడం వంటివి చేసేవాడు.
66
ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రపంచస్థాయి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మహేశ్ బాబుకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.