ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు కలిసి పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వసుధార మెనూ మొత్తం చెబుతూ ఉండగా వెంటనే రిషి వసుధార నేను ఈ పూటకు మాత్రమే తినాలి అనుకున్నాను నువ్వు ఈ పూటకి రేపు పొద్దున్నే కూడా తినిపించేలా ఉన్నావు అని అంటాడు. అప్పుడు వసుధార సరే సార్ అని చెప్పి ఈ పానీ పూరి తింటూ ఉంటారు. అప్పుడు రిషికి పానీ పూరి తినడం రాకపోయేసరికి అలా కాదు ఇలా తినాలి అని నేర్పిస్తూ ఉంటుంది వసుధార. అప్పుడు సరదాగా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ పానీపూరి తింటూ ఉంటారు.