Guppedantha Manasu: దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార.. వసుని బాధపెట్టిన రిషి?

First Published Jan 25, 2023, 8:20 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 24 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో మహేంద్ర జగతి లోపలికి వెళ్ళగా  అక్కడ దేవయాని ఉండడంతో అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. రండి రండి కూర్చోండి అని దేవయాని అనడంతో మీరేంటి అక్కయ్య ఇక్కడ అని అనగా మీ వల్ల కావడం లేదు కదా. వసుధార విషయంలో మీరిద్దరూ ఫెయిల్ అయ్యారు అని అంటుంది దేవయాని. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు వదినగారు అని మహేంద్ర అడగడంతో వసుధారని నా స్టైల్ లో డీల్ చేద్దామని వచ్చాను అంటుంది. వదిన గారు కాలేజీలో పరిస్థితులు ఏం బాగోలేవు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు అనడంతో అవన్నీ పట్టించుకోవద్దు మహేంద్ర అంటుంది.
 

ఇప్పుడు ఈ గోలంతా అవసరమా అక్కయ్య అని జగతి అనడంతో అవసరమే జగతి. తనని మనం ఎందుకు భరించాలి అనడంతో మిషన్ ప్రాజెక్టు హెడ్గా వసుధార పని చేస్తుంది. రిషి సవాలక్ష చెబుతాడు అవన్నీ మనం పట్టించుకుంటామా, అసలు ఆ కాలేజీకి పట్టిన దరిద్రాన్ని అని అంటుండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. లోపలికి వచ్చి నమస్తే మేడం వెల్కమ్ టు మై క్యాబిన్ అనడంతో మై కాలేజ్ అని అంటుంది దేవయాని. కాలేజీ మీదే కావచ్చు కానీ సీటు నాది నా సీట్లో మీరు ఎలా కూర్చుంటారు వెళ్లి రిషి సార్ క్యాబిన్లో కూర్చోండి ఎండి అవ్వండి అని అంటుంది. నీకు మర్యాదగా చెబుతున్నాను వసుధార నా గురించి నీకు తెలియదు వెళ్ళిపోతావా లేదా అని అనడంతో ఆరోజు మీరే కదా మేడం నాకు ఓటు వేసి మరీ గెలిపించారు.
 

 ఇప్పుడు మళ్ళీ ఓటు సెక్షన్ పెట్టి నన్ను ఓడించండి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు రిషి కి ఫోన్ చేస్తుండగా వెంటనే దేవయానికి ఫోన్ లాక్కుంటుంది. చూసావా జగతి ఎలా ప్రవర్తిస్తుందో అని అంటుంది దేవయాని. మేడం రిషి సార్ ఎక్కడున్నారు మేడం అర్జెంటుగా కలవాలి అని అనగా దేవయాని టెన్షన్ పడుతుండడంతో మీరు టెన్షన్ పడకండి మేడం నేనేమీ ఈ విషయం ఎవరికీ చెప్పను అని అంటుంది. వెళ్ళొస్తాను మేడం నేను రిషి సార్ ని కలవాలి. మీకు ఏమైనా కాఫీ, టీ చెప్పమంటారా అని దేవయాని గట్టిగా కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరొకవైపు రిషి పని చేసుకుంటూ ఉండగా అప్పుడు తలనొప్పిగా అనిపించడంతో ఫోన్ చేసి స్టాఫ్ బాయ్ ని పంపించమని చెబుతాడు.
 

అప్పుడు తలనొప్పితో సోఫా మీద పడుకోవడంతో ఇంతలో అక్కడికి వసుధార వస్తుంది. వచ్చావా వెరీ గుడ్ సమయానికి వచ్చావు తలనొప్పిగా ఉంది. అక్కడ బామ్ ఉంటుంది కాస్త మర్దన చెయ్ అనడంతో అప్పుడు వసుధార బామ్ తీసుకొని తలకు రాస్తూ ఉండగా వెంటనే రిషి వసుధార వైపు చూసి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు. మీకోసమే సార్ అని అనగా ఇక్కడ మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మీటింగ్ జరగలేదు కదా మరి ఎందుకు వచ్చావు అనడంతో మీతో మాట్లాడాలి సార్ మీకోసమే వచ్చాను అని అంటుంది. మాట్లాడడానికి ఏం లేదు వసుధార ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇలా వచ్చి తలకు మర్దన చేయడం మంచిది కాదు అని అంటాడు. సర్ నాకు మాట్లాడే సమయం ఇవ్వండి నేను ఏం జరిగిందో చెప్తాను అనగా నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను.

నాకు అవసరం లేదు అని అంటాడు. మీరు వద్దన్నా కూడా నేను చెప్పే తీరతాను సార్ అని అనడంతో వద్దన్నా పనులు చేయడం నీకు అలవాటే కదా అని అంటాడు. అప్పుడు రిషి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నుంచి కూడా వెళ్ళిపో వసుధార అని అంటాడు. అప్పుడు మీరే కదా సార్ నన్ను ఓటింగ్ పెట్టి గెలిపించింది అనడంతో మినిస్టర్ గారు చెప్పారు అని అంటాడు రిషి. అప్పుడు వసు ఎంత చెప్పిన వినిపించుకోకుండా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీటింగ్ హాల్లో వసుధార గురించి కాలేజీ స్టాప్ తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల కారణం వసుధార గారు మన కాలేజీ లో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గా ఉంటారు తనకి మనమందరం సహాయం చేయాలి అని అనడంతో సరే అని అంటారు.

జగతి మేడం సహాయం తీసుకో అని ఫణింద్ర అనడంతో స్వారీ సార్ నాకు ఆల్రెడీ ఎండిగా వర్క్స్ ఉన్నాయి అని చెప్పగా ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది వసుధార. మీటింగ్ ఓవర్ అని చెప్పి రిషి వెళ్ళిపోతుండగా ఆల్ ది బెస్ట్ చెప్పండి సరే అనడంతో చేతిలో జోడించి ఆల్ ది బెస్ట్ వసుధార గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. దాంతో వసుధార ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు వసుధార ఇంటికి చక్రపాణి రావడంతో వసుధార సంతోషపడుతూ మాట్లాడిస్తుంది. అప్పుడు చక్రపాణి అమ్మ వసు రిషి సార్ ని కలిసావా జరిగింది మొత్తం వివరించావా సార్ ఏమంటున్నాడు అని అనడంతో వసుధార మౌనంగా ఉంటుంది. నాన్న రిషి సార్ వాళ్ళను బాధపెట్టాను.

ఇంత తొందరగా మరిచిపోలేరు అనడంతో అప్పుడు చక్రపాణి నేను కూడా రిషి సారు టీచరమ్మతో చాలా దారుణంగా మాట్లాడాను తప్పుగా మాట్లాడాను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార తో చక్రపాణి ప్రేమగా మాట్లాడడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి జరిగింది మొత్తం నేను టీచరమ్మకి రిషి సార్ కి వివరిస్తాను అనడంతో అయ్యో వద్దు నాన్న నేను నిదానంగా అవన్నీ చూసుకుంటాను మీరు ఏం మాట్లాడకండి అని అంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను ఇంకెప్పుడు మనం వేరువేరుగా ఉండొద్దు అని అంటాడు చక్రపాణి.  అప్పుడు వసు వాళ్ళ నాన్నలో మార్పు రావడంతో అది చూసి సంతోషపడుతూ ఉంటుంది.

click me!