చరణ్, తారక్ కి సారీ.. మరోసారి మీకు టార్చర్ తప్పదు, 'నాటు నాటు' ఆస్కార్ నామినేషన్ పై రాజమౌళి ఎమోషనల్

First Published Jan 25, 2023, 6:51 AM IST

యావత్ దేశం పులకరించిపోయే అరుదైన మైలురాయికి ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ తుది నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

యావత్ దేశం పులకరించిపోయే అరుదైన మైలురాయికి ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ తుది నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా ఆర్ఆర్ఆర్ చిత్రం ఫారెన్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఇండియన్ చిత్రానికి విదేశాల్లో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి. 

ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ప్రపంచం మొత్తం ఊగిపోయేలా స్టెప్పులు వేయించింది. కొన్నిరోజుల క్రితం గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్.. ఇప్పుడు ఆస్కార్ ముంగిట నిలిచి యావత్ దేశం గర్వపడేలా చేసింది. నిన్న ప్రకటించిన ఆస్కార్స్ తుది నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

దీనితో దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. దేశం గర్వపడేలా చేశారని రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉండగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ సాధించడంతో జక్కన్న రాజమౌళి సోషల్ మీడియాలో ఎమోషనల్ మెసేజ్ చేశారు. 

'నా పెద్దన్న(కీరవాణి) నా చిత్రంలోని పాటకి ఆస్కార్ నామినేషన్స్ సాధించారు. ఇంతకి మించి నేను ఏమీ అడగలేను. ప్రస్తుతం నేను తారక్, చరణ్ కంటే ఎక్కువగా నాటు స్టెప్పులు వేస్తున్నా. చంద్ర బోస్ గారికి కంగ్రాట్స్.. ఆస్కార్ స్టేజి మీద మన పాట పడింది..థాంక్యూ. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాటకి మీ కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. నా అభిప్రాయం ప్రకారం ఆస్కార్ మీకే దక్కాలి. 

కాల భైరవ వల్లే నాటు నాటు సాంగ్ విషయంలో నేను ముందుకు వెళ్లగలిగాను. లవ్యూ భైరవ బాబు. భైరవ, రాహుల్ సిప్లిగంజ్ అందించిన సూపర్ ఎనెర్జిటిక్ గాత్రం ఈ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి చేర్చింది. 

ఈ సాంగ్ ఇంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం తారక్, చరణ్ అద్భుతమైన సింక్ తో, స్టైల్ తో చేసిన డ్యాన్స్. వీళ్ళిద్దరూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో డ్యాన్స్ చేస్తున్నారు. మిమ్మల్ని టార్చర్ పెట్టినందుకు నన్న క్షమించండి. కానీ మరోసారి మీ ఇద్దరినీ టార్చర్ పెట్టేందుకు వెనుకాడను అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. 

ఆస్కార్ అవార్డు సాధించాలని నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. కానీ అభిమానులు కోరుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అంతగా నమ్మింది వారే. వారి క్రేజీ రెస్పాన్స్ వల్లే ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఈ ప్రాసెస్ లో ఎంతో కష్టపడిన కార్తికేయ, వాల్ అండ్ ట్రెండ్స్ సంస్థకి నా కృతజ్ఞతలు అంటూ రాజమౌళి కామెంట్స్ చేశారు. 

click me!