గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించారు. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. పాతిక చిత్రాలకు పైగా నటించారు. విలక్షణ పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ చిత్ర విజయం మీద మంచు లక్ష్మి విశ్వాసంతో ఉన్నారు.