Guppedantha Manasu: తల్లి ప్రేమను గుర్తించమని అడిగిన జగతి.. దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార?

Published : Apr 14, 2023, 07:10 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Guppedantha Manasu: తల్లి ప్రేమను గుర్తించమని అడిగిన జగతి.. దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార?

ఈరోజు ఎపిసోడ్ లో రిషి మహేంద్ర ఫణీంద్ర తో మాట్లాడుతూ తన ప్లాన్ గురించి వివరిస్తూ ఉంటాడు. తను చెప్పినట్టుగా పేపర్లో రాయించమని చెబుతాడు. అలా ఒక ప్రెస్ నోట్ తయారు చేసి ప్రెస్ కి ఇవ్వండి డాడ్ అన్ని పేపర్లలో రేపటికి ఈ టాపిక్ రావాలి అనగా సరే రిషి అని అంటాడు. ఆ తర్వాత ధరణి పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వెళ్లడంతో ఎందుకు వచ్చావ్ వసుధార రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనగా పర్లేదు మేడం అని అంటుంది . భోజనం చేశారా వసుధార అని అడగగా లేదు మేడం ఈ గొడవల్లో పడి ఆ విషయం గురించి ఆలోచించలేదు రిషి సార్ అలాగే పడుకుంటారు అనగా అయ్యో వసుధార ఇప్పుడే వంట పాత్రలు అని శుభ్రం చేశాను ఇంట్లో భోజనం లేదు అనడంతో పర్లేదు మేడం ఈ ఆపిల్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని వెళ్తాను అని అంటుంది.
 

27

 రిషి అంటే ఎంత ప్రేమ వసుధార అనగా సార్ మీద ఉన్న ఇష్టం ప్రేమ కొలవలేను మేడం అని అంటుంది. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. నాకు నా ప్రాణం  కంటే తనే ఎక్కువ అనగా ఆ మాటలు విన్న రిషి సంతోషపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా జగతి పిలిచి వాటర్ కావాలా రిషి తెచ్చిస్తాను అనగా మీకు ఒక విషయం చెప్పాలి మేడం అని అంటాడు రిషి. ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనిపిస్తోంది మీ శిష్యురాలని నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్ మేడం అనగా జగతి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార గురించి రిషి ప్రేమగా మాట్లాడడంతో ఆ మాటలకు జగతి సంతోష పడుతూ ఉంటుంది. 
 

37

అన్ని బాగానే ఉన్నా నా విషయంలో మాత్రం ఎప్పటికీ నా గుండెను గుచ్చే ఒక కొరత మాత్రం తీరదు మేడం అనడంతో జగతి బాధపడుతూ ఉంటుంది. ప్రేమకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే మీరు మన బంధానికి ఎందుకు దూరంగా వెళ్లిపోయారని అడగాలని ఉంది మేడం అని అంటాడు రిషి. కానీ అడగను మేడం ఎందుకంటే మీ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు అనగా జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి మన మధ్యలో దూరానికి కారణం చాలా సార్లు చెప్పాలని ప్రయత్నించాను కానీ నువ్వు వినిపించుకోలేదు వినిపించుకునే సిచువేషన్ లో కూడా లేవు అని అంటుంది. అంటే ఏంటి మేడం అపార్ధాలు ఎప్పటికీ అర్థం కాకుండా అలాగే ఉంటాయని మీరు అనుకుంటున్నారా అని అంటాడు. అయినా గడిచిన క్షణాలు అన్ని మళ్ళి తిరిగి వస్తాయా మేడం అని అంటాడు.
 

47

 చెప్పాల్సిన వయసు మీకు దాటిపోయింది అడగాల్సిన వయసు నాకు దాటిపోయింది అని రిషి బాధగా మాట్లాడగా ఆ మాటలకు జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పర్లేదు మేడం మన బంధానికి అటువైపు మీరు ఇటువైపు నేను మధ్యలో తెర మాత్రమే ఉంది ఆ తెర ఎప్పటికీ తరగనిది మేడం ఉంటాడు. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా రిషి ప్లీజ్ ఒకే ఒక్క మాట మాట్లాడాలి అని అంటుంది జగతి. రిషి నువ్వు కోల్పోయినట్టు నేను కూడా కోల్పోయాను కొడుకుతో అమ్మ అని పిలిపించుకోలేకపోయాను. నేను కూడా అన్ని బంధాలకు దూరం అయ్యాను. కనీసం ఈ విషయం అయిన నువ్వు తెలుసుకుంటే ఈ అమ్మ మీద జాలి పుడుతుందేమో అని కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంది జగతి. 
 

57

మనం జాగ్రత్తగా ఉండాలి రిషి కనిపించని శత్రువులు ఎక్కువ అవుతున్నారు మనపై దాడి చేయాలని పంచుకు కూర్చున్నారు జాగ్రత్తగా ఉండు అని అంటుంది. ముఖ్యంగా నువ్వు ఆచితూచి అడుగులు వేయాలి అని అంటుంది జగతి. ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రిషి జగతి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ధరణి యాపిల్స్ తీసుకొని రావడంతో ఇప్పుడెందుకు వదిన నాకు ఆకలిగా లేదు అనగా ఇవి నేను పంపించలేదు రుచి వసుధార నీకోసం పంపించింది అని అంటుంది ధరణి. వసుధార కి  నువ్వంటే చాలా ఇష్టం రిషి నువ్వంటే తనకు ప్రాణం అనడంతో తెలుసు వదిన ఇందాక మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను అని అంటాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు రిషి వసుధార లాంటి అమ్మాయి దొరికింది అని అంటుంది ధరణి. 
 

67

తర్వాత వసుధార గదిలోకి వెళ్తుండగా ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అనగా సంతోషించాల్సిన విషయమే కదా మేడం అనడంతో అదేంటి మెడలో తాళిబొట్టు లేకుండా తిరుగుతున్నావు అనగా తొందర్లోనే నా మొగుడు తాళికట్టబోతున్నాడు అలాంటప్పుడు నేను మళ్ళీ ఎందుకు కట్టుకోవడం మేడం అని అంటుంది. జనాలు అడిగితే ఏం చెప్తావు అనగా మీ వల్లే ఊడిపోయిందని చెప్తాను మేడం అందుకు కారణం మీదే అని చెబుతాను ఆ రోజు పీడకలలో మీరే భయంకరంగా వచ్చారు ఆ భయంతోనే నా తాళి తెగిపోయింది అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీరు ఏదో చేయాలని చూశారు కానీ అది జరగలేదు కదా అని అంటుంది వసుధార. సమయానికి పనింద్ర సార్ నిజం చెప్పారు కాబట్టి సరిపోయింది లేదంటే మీకు నిజం చెప్పేవారా అని అడుగుతుంది.
 

77

ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి వారిద్దరి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు దేవయానికి సమాధానం చెబుతుండగా ఆ మాటలు విన్నది సంతోషపడుతూ ఉంటాడు. బాగా పొగరు పట్టింది అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని. ఆ తర్వాత రిషి వసుధార గదిలోకి వెళ్ళగా చెప్పండి సార్ అని అంటుంది. నేను చూడ్డానికి వచ్చాను ఇందాక పెద్దమ్మతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను చాలా ధైర్యంగా మాట్లాడావు అని అంటాడు. అందులో భయపడాల్సిన విషయం ఏముంది సార్ అనడంతో నిజమే అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!

Recommended Stories