Guppedantha Manasu: దేవయానికి గట్టి కౌంటర్ ఇచ్చిన జగతి.. వసును కాపాడిన రిషి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 03, 2021, 12:24 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్  బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu:  దేవయానికి గట్టి కౌంటర్ ఇచ్చిన జగతి.. వసును కాపాడిన రిషి!

వసు (Vasu), రిషి (Rishi) లు కార్తీకమాసం వన భోజనం కోసం కారులో బయలుదేరగా దారి మధ్యలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి స్థలం చూడాలని అనుకుంటుండగా దారి మధ్యలో ఒక అబ్బాయి కారుకు ఎదురుగా రావడంతో ఏం జరిగింది అని అతడిని అడగడం అతడికి న్యాయం చేయడం కోసం రిషి వసు బయలుదేరిన సంగతి తెలిసిందే.
 

27

అతడిని గోలీల ఆటల్లో మరో అబ్బాయి మోసం చేసి గెలిచాడు అని చెప్పటంతో వసు (Vasu) అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిని పిలిచి వాడితో ఆట ఆడటానికి పోటీకి దిగుతుంది. పక్కనే ఉన్న రిషి (Rishi) వారికి న్యాయం చెప్పాలని వచ్చి ఆట ఆడుతున్నావేంటి అనేసరికి చెప్పటం కంటే ఆడి చూపించడం లోనే న్యాయం తెలుస్తుందని అంటుంది.
 

37

వసు మాటలకు రిషి (Rishi) కూడా ఓకే అనేసరికి ఆ అబ్బాయితో వసు ఆట ఆడటం మొదలు పెడుతుంది.  కాని వాడు మొత్తం చీట్ చేసి ఆడుతాడు. ఆ తర్వాత వసు (Vasu) వరుసగా గెలుస్తుంది. రిషిని కూడా ఆడమని రిషి కూడా ఆడి గెలుస్తాడు. ఆ అబ్బాయి ఓడిపోయినందుకు బాధపడతాడు.
 

47

ఆ అబ్బాయి కి వసు (Vasu) సర్దిచెప్పి న్యాయం చేస్తుంది. ఇక అందులో మరో అబ్బాయి వసు గెలిచినందుకు తనకు గోలీలు ఇస్తాడు. అక్కడి నుంచి వసు, రిషి బయలుదేరుతారు. వసు గోలీలను చూస్తూ మంచి మూమెంట్ అని మురిసిపోతుంది. అందులో సగం గోలీలను రిషికి (Rishi) తన దగ్గర ఉంచుకోమని చెబుతుంది.
 

57

మరోవైపు కార్తీక మాసం వన భోజన కార్యక్రమం దగ్గరకు మహేంద్ర వర్మ (Mahendra)కుటుంబం బయల్దేరుతుంది.  అక్కడికి కమిషనర్ భార్య వచ్చి వాళ్లను పలకరిస్తుంది.  దూరంగా ఉన్న జగతిని దేవయాని కోపంగా చూస్తుంది. ధరణిని (Dharani) తనతో మాట్లాడవద్దని చెబుతుంది.
 

67

కమిషనర్ భార్య జగతి (Jagathi) దగ్గరకు వెళ్లి దేవయాని వాళ్ళకి జగతి ని పరిచయం చేస్తుంది. ఇక జగతి తనకు దేవయాని వాళ్ళ కుటుంబం తెలుసు అని చెబుతుంది.  మహేంద్రవర్మ వాళ్ళు కమిషనర్ ను కలవడానికి పక్క కి వెళ్తారు. దేవయాని (Devayani) తన మాటలతో జగతిని రెచ్చగొట్టేలా చేస్తుంది.
 

77

కానీ తిరిగి జగతి (Jagathi) దేవయానికి కౌంటర్ వేస్తుంది. ధరణి జగతిని పలకరిస్తుంది. అలా కాసేపు వారి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తరువాయి భాగం లో చెట్టుకు ఉయ్యాల కట్టాలని వసు చెట్టు ఎక్కుతుండగా చెట్టు మీద నుంచి కింద పడిపోతూ ఉండగా రిషి (Rishi) పట్టుకుంటాడు. ఆ తర్వాత రిషి తనపై అరుస్తాడు.  ప్రతిసారి కింద పడుతున్న సమయంలో నిన్ను పట్టుకోవడం నాకేమైనా పార్ట్ టైం జాబా అంటూ వసు పై ఫైర్ అవుతాడు.

click me!

Recommended Stories