Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానాల్లోనే దూసుకెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
కాలేజ్ నుంచి జగతి (Jagathi), మహేంద్ర వర్మ కారులో వస్తు రిషి గురించి మాట్లాడుకుంటారు. తన ప్రవర్తన గురించి చర్చ చేసుకుంటారు. రిషి ఎక్కడికి వెళ్ళాడోనని మహేంద్రవర్మ (Mahendra) టెన్షన్ పడటంతో జగతి రిషికి అన్నీ తెలుసని ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్లొద్దనే ఆలోచనలు తనకు ఉన్నాయని అంటుంది.
210
మరోవైపు వసుధార (Vasudhara), రిషి జగతి ఇంట్లో భోజనం చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా రిషి (Rishi) జగతి ఇంటికి వెళ్లి భోజనం చేసే విధానం చూడటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా వసుతో సంతోషంగా కనిపిస్తుంటాడు.
310
జగతి (Jagathi) ఇంట్లో వసుధార ఒక్కతే ఉందని తొందరగా వెళ్దామని మహేంద్ర వర్మ తో అంటుంది. ఇక మహేంద్రవర్మ జగతి మాటలకు తను మాటలు మారుస్తూ ఉండటంతో వెంటనే జగతి మహేంద్ర వర్మ (Mahendra) మాటలు కనిపెడుతుంది.
410
రిషి (Rishi) వసుతో మాట్లాడుతుండగా జగతి మేడం ఇంటికి వచ్చి భోజనం చేసినందుకు చాలా సంతోషమని అనడంతో వెంటనే రిషి ఆలోచనలో పడతాడు. ఇక్కడికి వచ్చి భోజనం చేశాను ఏంటని అనుకుంటాడు. వసుతో (Vasu) మాట్లాడకుండా వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతాడు.
510
వసు (Vasu) రిషిని (Rishi) ఎంత పిలిచిన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఈ సార్ ఎప్పుడూ అర్థం కారని అనుకుంటుంది. ఇక రిషి కారులో బయలుదేరుతూ ఎన్నడూ లేని విధంగా ఇలా ప్రవర్తించాను ఏంటి అని అనుకుంటాడు.
610
అక్కడ భోజనం చేయడం ఏంటి అని ఆలోచనలో పడుతూ మళ్లీ భోజనం చేయకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. జగతి (Jagathi), మహేంద్ర వర్మ (Mahendra), వసు లు కలిసి కాసేపు మాట్లాడుకొని కనిపించగా మహేంద్రవర్మ అక్కడనుంచి వెళ్ళిపోతాడు.
710
జగతి డైనింగ్ టేబుల్ పైన ఉన్న రెండు ప్లేట్లను చూసి ఆశ్చర్య పడుతుంది. ఎవరు వచ్చారు అని వసు (Vasu) ని అడగటం తో చెప్పడం మర్చిపోయాను అంటూ రిషి (Rishi) సర్ వచ్చాడు అని చెబుతుంది. ఆకలేస్తుందని వంట చేసుకొని భోజనం చేశామని అంటుంది.
810
ఇక జగతి (Jagathi) వసు పై కోపంతో అరుస్తుంది. నువ్వే ఒక గెస్ట్ వి మళ్లీ నీ గెస్ట్ ను పిలవడం ఏంటి అని అలా గెస్ట్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసేది తెలియదా అంటూ వసుని అనడంతో రిషి (Rishi) సర్ కదా మేడం అని చెబుతుంది.
910
జగతి (Jagathi) పక్కకు వెళ్లి రిషి (Rishi) భోజనం చేసినందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది. అంత మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను అంటూ అందుకే వసు పై కోపంతో అరిచాను అని అనుకుంటుంది.
1010
దేవయాని (Devayani) ఫణీంద్ర వర్మ తో కాసేపు ప్రశాంతంగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. రిషి రావటంతో కాసేపు పలకరిస్తూ మాట్లాడుతుంది. ధరణి (Dharani) మహేంద్రవర్మతో దేవయాని ప్రవర్తన గురించి చెబుతుంది.