Aamir Khan తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయాక 2005లో Kiran raoని వివాహం చేసుకున్నారు. లగాన్ చిత్రానికి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం మొదలయింది. అయితే అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోవడానికి కారణం దంగల్ నటి ఫాతిమా సనా అంటూ ఊహించని పుకార్లు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్, ఫాతిమా మధ్య ఎఫైర్ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వీరిద్దరి ఎఫైర్ గురించి రూమర్లు వినిపించాయి.