బంధం అనకుంటే భ్రమ అవుతోంది నువ్వేమో జైల్లో ఉన్నావు మీ అమ్మానాన్నలు హాస్పిటల్ లో ఉన్నారు అయినా నువ్వు వెళ్ళమంటే వెళ్తానని అనుకున్నావా అనుకుంటూ ఉంటాడు రిషి. ఎప్పటికీ రిషిధారలు విడిపోరు. నేను విడిపోనివ్వను అని అక్కడి నుంచి హాస్పిటల్ కి బయలుదేరుతారు. మరొకవైపు హాస్పిటల్ లో చక్రపాణి,సుమిత్ర చికిత్స తీసుకుంటుండగా ఇంతలోనే రాజీవ్ అక్కడికి వస్తాడు. అప్పుడు వారిద్దరిని చూసి సంతోష పడుతూ ఉంటాడు రాజీవ్. అప్పుడు రాజీవ్ చక్రపాణితో మాట్లాడుతూ నాకు మీ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నాకు ప్రాబ్లం ఉన్నది అత్తయ్య గారితోనే అత్తయ్య గారి నాకు పెద్ద ప్రాబ్లం అనుకుంటూ సుమిత్ర దగ్గరికి వెళ్తాడు.