ఈ లోపు రిషి (Rishi) దగ్గరకు వచ్చి వసు (Vasu) నడుము మీద చేతులు వేసి పడకుండా పట్టుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మీద పూలు కూడా పడుతాయి. ఆ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. క్లాస్ మొత్తం వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రిషి డెకరేషన్ చూసి సానుభూతి నాకు అవసరం లేదు అంటాడు.