Guppedantha Manasu: సాక్షికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వసుధార.. రిషీకి ఐ లవ్యూ చెప్పేసిన వసు!

Published : Jun 15, 2022, 10:33 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: సాక్షికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వసుధార.. రిషీకి ఐ లవ్యూ చెప్పేసిన వసు!

 ఈరోజు ఎపిసోడ్ లో వసుధార,రిషి సార్ ని ఎందుకు లోపలికి పంపించారు అని జగతి(jagathi),మహేంద్ర లపై విరుచుకు పడుతుంది. కనీసం మీరు అయిన చెప్పాలి కదా మేడం అంటూ జగతిపై అరుస్తుంది. మేడం చెప్పకపోయినా కనీసం మీరైనా చెప్పాలి కదా సార్ అని మహేంద్ర(mahendra) అని అడుగుతుంది.
 

26

అప్పుడు వెంటనే జగతి మరి నువ్వు ఎందుకు లోపలికి వెళ్లావు వసు(vasu) అని అడగడంతో ఆ మాటకు వసుధార సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు మేడం వాళ్ళకి ఏం చెప్పాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జగతి (jagathi)ముందు నువ్వు క్లారిటీ ఇవ్వు వసు. ఈ ప్రశ్నకు మా దగ్గర సమాధానం చెప్పకుండా తప్పించుకున్నావు.
 

36

 రిషి దగ్గర తప్పించుకోలేవు రిషి(rishi) కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు అని అంటుంది జగతి. మరొకవైపు రిషి ఒంటరిగా కూర్చుని ల్యాబ్ లో జరిగిన విషయం గురించి తలుచుకుని బాధ పడుతూ ఉంటాడు. అంతే కాకుండా అప్పుడు వసుధార(vasudhara) మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తాడు. ఈ వసు ఏంటో అర్థం కాదు.
 

46

ఎందుకు ఇలా చేసావు అంటే ఏదో కారణాలు చెబుతుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి. వసు కూడా జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సాక్షి (sakshi)అక్కడికి వచ్చి రిషి(rishi)ని కాపాడినందుకు వసుధార కి థాంక్స్ చెప్పి స్వీట్ ఇస్తుంది. అప్పుడు వసు ని రెచ్చగొట్టే విధంగా సాక్షి మాట్లాడుతుంది. కానీ వసు మాత్రం నవ్వుతూ స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తుంది.
 

56

అప్పడు వసు ధైర్యంగా మాట్లాడడంతో సాక్షి (sakshi)ఆశ్చర్యపోతుంది. ఇంతకు ముందు వరకు ఏం అర్థం కాకుండా ఉన్న దాన్ని ఇప్పుడు మాత్రం క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చింది అని సాక్షి గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అప్పడు వసు రిషి సార్ ని నేను అస్సలు వదలను.. నువ్వు రిషి(rishi)సార్ ఎప్పటికి కలవలేవు అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

66

ఆ తరువాత నీకు ఒక గిఫ్ట్ అందరూ సాక్షి ఇచ్చిన చెక్కు ను తిరిగి ఇస్తుంది వసు(vasu). అయితే అదే విషయం గురించి ఋషి చెప్పాలి అని బయలుదేరుతుంది. రిషి కీ మెసేజ్ చేసి ఒక చోట కి రమ్మని చెబుతుంది. అలా మొత్తానికి ఇద్దరూ ఒకచోట కలుసుకుంటారు. అప్పుడు వసుధార నెమ్మదిగా తన మనసులోని మాటలను బయట పెడుతూ వస్తుంది.

click me!

Recommended Stories