ఎపిసోడ్ ప్రారంభంలో వసుధారని తనతో పాటు భోజనానికి తీసుకువస్తుంది ఏంజెల్. అంతలో రిషి కూడా డాబా మీద నుంచి కిందికి వస్తాడు. కదా కలిసి భోజనం చేద్దాం అంటుంది ఏంజెల్. నేను రాను నా గదిలో భోంచేస్తాను అంటాడు రిషి. అదేంటి ఎప్పుడూ లేనిది ఈ అలవాటు అంటుంది ఏంజెల్. వసుధారా మనసులోనే ఏంటి సార్ నా నుంచి పారిపోతున్నారా అని అనుకుంటుంది. ఆ మాటలని అర్థం చేసుకున్న రిషి పారిపోవాల్సిన అవసరం నాకేముంది అని తను కూడా మనసుతోనే సమాధానమిస్తాడు.