కీర్తి సురేష్ లో అలాంటి ఫీలింగ్స్... వెన్నెల లేటెస్ట్ లుక్ చూసిన నెటిజెన్స్ డౌట్ అదే!

Sambi Reddy | Published : Jul 24, 2023 7:05 AM
Google News Follow Us


స్టార్ లేడీ కీర్తి కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుండగా అమ్మడు ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. నవ్వులు చిందిస్తూ ఆకట్టుకునే ఫోటో షూట్ చేసింది. 
 

17
కీర్తి సురేష్ లో అలాంటి ఫీలింగ్స్... వెన్నెల లేటెస్ట్ లుక్ చూసిన నెటిజెన్స్ డౌట్ అదే!
Keerthy Suresh

తాజాగా కీర్తి సురేష్ పసుపు పచ్చ చుడిదార్ ధరించి నిండుగా కనిపించింది. మలయాళీ భామ నవ్వులు మనసులు దోచేశాయి. సదరు ఫోటోలకు పాజిటివ్ ఫీలింగ్స్ అంటూ కామెంట్ పెట్టింది. కీర్తి సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతుండగా పిచ్చ హ్యాపీగా ఉందని తెలుస్తుంది. 

27
Keerthy Suresh

ఇక కీర్తి ఫోటోలను చూసిన నెటిజెన్స్ పలు డౌట్స్ అడుగుతున్నారు. కీర్తి డ్రెస్ ఎక్కడ కొన్నావు అని ఒకరు కామెంట్ చేయడం విశేషం. కీర్తి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. చుడిదార్ లో కీర్తి చాలా అందంగా ఉంది. 

 

37
Keerthy Suresh

తమిళ చిత్రం మామన్నన్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నాయకుడిగా విడుదలైంది. ఈ మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించింది. ఉదయనిధి స్టాలిన్ కి ఇక్కడ మార్కెట్ లేదు. అందుకే పెద్దగా ఆడలేదు. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టింది. సర్కారు వారి పాట, దసరా భారీ విజయాలు నమోదు చేశాయి. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో దసరా బిగ్గెస్ట్ హిట్. 

Related Articles

47
Keerthy Suresh


మహేష్ బాబు హీరోగా గత ఏడాది విడుదలైన సర్కారు వారి పాట రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ గా అదరగొట్టింది. మహేష్ స్టామినా మరోసారి నిరూపించింది. ఈ మూవీలో కీర్తి సురేష్ నెగిటివ్ రోల్ చేయడం విశేషం. 
 

57
Keerthy Suresh


స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ సిస్టర్  రోల్స్ కి వెనకాడటం లేదు. సాధారణంగా హీరోయిన్స్ చెల్లెలు పాత్రలు చేస్తే కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. 

 

67
Keerthy Suresh


ప్రస్తుతం పలు భాషల్లో అరడజను సినిమాల వరకు కీర్తి చేస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారని సమాచారం. ఒకప్పుడు సినిమాకు రెండు కోట్లు తీసుకున్న కీర్తి రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అలాగే కీర్తి రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

77
Keerthy Suresh

కీర్తి పాలిటిక్స్ లో వస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కీర్తి ఆసక్తికరంగా స్పందించారు. వెంటనే రాకపోయినా భవిష్యత్తులో వచ్చే ఆలోచన ఉన్నట్లు ఆమె కామెంట్స్ ఉన్నాయి. ఇక కీర్తి పెళ్లిపై పలు రూమర్స్ ఉన్నాయి.

Recommended Photos