Guppedantha manasu: రిషి, వసుల మధ్య బలపడుతున్న బంధం.. రొమాంటిక్ మాస్టర్ అయిన మిస్టర్ ఇగో!

Published : Apr 04, 2022, 10:06 AM IST

Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ మంచి ప్రేమ కథ  నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha manasu: రిషి, వసుల మధ్య బలపడుతున్న బంధం.. రొమాంటిక్ మాస్టర్ అయిన మిస్టర్ ఇగో!

ఇక రిషి (Rishi) ఒక చోట చెస్ ఆడుతూ ఉంటాడు.. ఈలోపు అక్కడకు వసు వస్తుంది. ఈలోపు చెస్ ఆడుతావా అని రిషి ఆఫర్ చేస్తాడు. దాంతో వసు (Vasu) నాకు చెస్ వచ్చు కానీ మరీ మీ లాగా రెండూవైపులా ఆడే అంత రాదు అని అంటుంది. ఇక రిషి నేను ఏం చేస్తా ఒంటరి వాడిని అని అంటాడు.
 

26

ఇక వసు (Vasu) చెస్ ఆడడానికి అంగీకరిస్తుంది. అంతేకాకుండా మీరు ఓడిపోతే నేను చెప్పిన మాట మీరు వినాలి. నేను ఓడిపోతే మీరు చెప్పిన మాట నేను వినాలి. అని ఒప్పందం కుదుర్చుకుని రిషి (Rishi) వసులు ఇద్దరు ఆట ప్రారంభిస్తారు. ఇక చివరికి వసు నే ఆట గెలుస్తుంది.
 

36

రిషి (Rishi) కూడా కంగ్రాట్స్ చెబుతాడు. వసు అట గెలిచినందుకు జగతి మేడం ఇచ్చిన ఫైల్స్ ను రిషి ను చూడమంటుంది. ఇక ఆ తర్వాత వసు రెస్టారెంట్ లో నుంచి ధరణికి ఫోన్ చేస్తుంది. ఇక దేవయాని కాల్ లిఫ్ట్ చేస్తుంది. వసు ఒకసారి ధరణి కి ఫోన్ ఇవ్వండి అనగా.. ధరణి (Dharani) కి నేను అసిస్టెంట్ కాదని విరుచుకుపడుతుంది.
 

46

ఇక వసు (Vasu) కూడా..  ఇతరుల ఫోన్ లు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయడం తప్పు అని దేవయానికి స్వీటుగా బుద్ధి చెబుతుంది. ఆ తరువాత రిషి వసులు కలిసి ఇద్దరు ఒకచోట కలుసుకుంటారు. మరోవైపు దేవయాని రిషి (Rishi) ఎక్కడికి వెళ్లి ఉంటాడు. ఆ పొగరుబోతు వసు దగ్గరికి వెళ్లి ఉంటాడా అని ఆలోచిస్తుంది.
 

56

ఇక రేపటి భాగంలో వసు (Vasu) రిషితో కలిసి దుప్పటి ముసుగు వేసుకొని టెక్స్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపు అది జగతి గమనిస్తుంది. దుప్పటి తెరిచి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో మీ అబ్బాయి తో చాట్ చేస్తున్నా అని అంటుంది. ఇక జగతి (Jagathi) దుప్పటి తీసి కూడా చాట్ చేయొచ్చుగా అని అడుగుతుంది.
 

66

ఇక దాంతో వసు (Vasu) కు ఏం చెప్పాలో అర్థంకాక సతమతం అవుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి దుప్పటి వేసుకునే వరకు వచ్చింది వీరి బంధం.

click me!

Recommended Stories