Guppedantha Manasu: రిషిని ఫాలో అవుతున్న వసు.. కాలేజ్ స్టాఫ్ పై సీరియస్ అయిన వసు?

First Published Jan 26, 2023, 8:02 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 25 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ వసు అన్న మాటలు తలచుకొని ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అనుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలోనే వసుధార వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు రిషి చూడు వచ్చేది నువ్వే అని తెలుసు వచ్చే వసుధార అనడంతో వసుధార పక్కకు వచ్చిన నిలబడుతుంది. ఏంటి వసుధార ఎందుకు నన్ను వెంటాడుతున్నావు అనడంతో సార్ నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. వసుధార అసలు నీకు ఏమయ్యింది. ప్రతిసారి ప్రతి చోట్ల మాట్లాడాలి మాట్లాడాలి అంటున్నావు అని అంటాడు. నువ్వేం చెప్పినా నేను వినను అని అంటాడు.

 నన్ను విసిగించకు వెళ్ళిపో అని వసుధార మీద సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి ఒకచోట కూర్చుని వసుధార ఎందుకు నా జీవితంలోకి వచ్చావు. నేను నీ ప్రేమలో ఎందుకు పడ్డాను ఎన్ని అందమైన జ్ఞాపకాలు మన మధ్య ఎన్నో వెన్నెల రాత్రులు నీ చిరునవ్వు చూశాను అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి అక్కడే ఉన్న పేపర్ గ్లాసులోకి రాళ్లు విసురుతూ ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి రాయి విసరడంతో అది చూసి కోపంగా పైకి లేస్తాడు. అప్పుడు వసుధార మెడలో చూసి మరింత కోపం తగిలిపోతూ ఉంటాడు రిషి. టైం ఇప్పటికే చాలా అయింది గౌతమ్ ఫ్లాట్ పక్కనే అని అనడంతో గౌతమ్ సార్ ఫ్లాట్ వైపు మీరు ఎందుకు వచ్చారు సార్ అనడంతో ఏం మాట్లాడకుండా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వసుధార మొబైల్ ఫోన్లో రిషి ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది. జరిగింది నన్ను చెప్పనివ్వడం లేదు ఎన్ని రోజులని నన్ను ఇలా దూరం పెడతారు మీరు ఎన్ని రోజులని బాధపడతారు సార్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి చక్రపాణి వస్తారు. ఏమ్మా వసు పడుకోలేదా అనగా నిద్ర పట్టడం లేదు నాన్న అంటుంది. అప్పుడు చక్రపాణి రిషి సార్ గుర్తుకు వచ్చారా అనగా అప్పుడు వసు ఏడుస్తుండడంతో అమ్మ వసు రిషి సార్ ఒక మాట అంటే కోపగించుకోకు రిషి సార్ బంగారం. అయినా నేను రిషి సార్ గురించి నీకు చెప్పడం ఏంటి అనగా అవును నాన్న రిషి సార్ చాలా మంచి వారు అంటుంది.
 

ఇప్పుడు చక్రపాణి వసుధారకి ధైర్యం చెబుతూ జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. రిషి సార్ నువ్వు చెప్పేది వినకపోతే చెప్పు వసుధార నేను వెళ్లి రిషి సార్ ని ఒప్పిస్తాను అని అంటాడు చక్రపాణి. అప్పుడు వసుధర ఏడుస్తూ నాన్న ఎంత చెప్పాలని ప్రయత్నించినా వీలు పడట్లేదు అని ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి కూడా బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార గురించి జగతి, మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. వసు చేసిన గాయం నుంచి రిషి తొందరగానే బయటపడ్డాడు అనుకుంటూ ఉంటారు. అది మనం సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ కళ్ళు ఎదురుగా వసు కనిపిస్తుంటే జరిగిన విషయాలు గుర్తుకు వస్తాయి అంటుంది జగతి.
 

రిషి అందరినీ వదిలేసి వెళ్తాను అని వెళ్లకుండా ఉన్నాడు అంటే అది సంతోషించాల్సిన విషయమే ఏనప్పటికీ రిషి లోలోపల ఎంత బాధ పడుతున్నాడో అన్నది మనం చెప్పలేం మహేంద్ర అంటుంది జగతి. అసలు వసుధార ఎందుకు ఇలా చేసిందో నాకు ఇప్పటికీ అందు పట్టడం లేదు అనడంతో సరే వెళ్దాం పద మహేంద్ర అని వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు రిషి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు పదే పదే వసుధార మెడలో తాళి గుర్తుకువస్తుంటుంది. ఏంటి వసుధార ఇది నేను ఏదైతే మర్చిపోవాలి అనుకుంటున్నాను దాన్ని మర్చిపోలేక పోతున్నాను అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధర మెడలో తాళికి ఉన్న ఉంగరాన్ని చూసి ఉంగరానికి ముద్దు పెట్టి దాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది.

అప్పుడు వసుధార రిషికి ఫోన్ చేసి నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లాలి అనుకుంటున్నాను నాతో పాటు మీరు వస్తారా అనడంతో విషయం మాట్లాడకుండా మౌనంగా ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత వసుధార పని చేసుకుంటూ ఉండగా ఇంతలో లోపలికి కాలేజీ స్టాఫ్ వస్తారు. మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అంతవరకు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఫైల్ చదవండి అని అనడంతో వాళ్ళు చదువుతూ ఉంటారు. అప్పుడు వసుధార గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉండడంతో వెంటనే వసుధార సీరియస్ అవుతుంది. నీ పెళ్లి ఎప్పుడు అయింది అనడంతో అవన్నీ నా వ్యక్తిగతం మేడం అని అంటుంది. అప్పుడు వసుధార కాలేజీ స్టాప్ మీద సీరియస్ అవడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసుధర కాలేజీ స్టాప్ కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్తుండగా మధ్యలో కార్ ట్రబుల్ ఇస్తుంది.
 

ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు లేటుగా వెళ్తే బాగుండదు నా కారులో డ్రాప్ చేస్తాను రండి అని పిలుస్తాడు. తర్వాత వసుధార వెళ్లి వెనుక వైపు సీట్లో కూర్చొగా మేడం ముందు వైపు రిషి పక్కన కూర్చుంటుంది. అప్పుడు రిషి వసు వైపు చూస్తూ నా పక్కన కూర్చొవాల్సిన దానివి వెనుక వైపుకు వెళ్ళిపోయావు అనుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు మీ మనసులోనే ఉంటాను సార్ కానీ మీరు నాకు ఆ విషయం చెప్పడానికి టైం ఇవ్వడం లేదు అనుకుంటూ ఉంటుంది వసుధార. అప్పుడు కాలేజీ స్టాప్ కావాలనే వసుధర పెళ్లి గురించి రిషి దగ్గర ప్రస్తావని తీసుకువస్తుంది. అప్పుడు రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

click me!