ఆవిడ ఎవరో ఆత్మీయురాలి లాగా అనిపిస్తుంది, డాడీకి తనకి ఏదో గతం ఉన్నట్టు ఉంది అంటాడు రిషి. అనుకోవడం కాదు సార్ నిజంగానే ఉంది ఆరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అక్కడ జగతి మేడం మావయ్య పేరుతో పాటు ఆవిడ పేరు కూడా ఉంది. తర్వాత ఆవిడ మావయ్యని ఒకసారి రిసార్ట్లో డ్రాప్ చేసినప్పుడు నేను చూశాను అంటుంది. అవునా ఇదంతా నాకెందుకు చెప్పలేదు అంటాడు రిషి.