అప్పుడు రిషి, అప్పుడు ప్రేమ లేదన్నావు ఇప్పుడు ప్రేమ అంటున్నావు అసలు ఏంటిది వసుధార అని అనగా, మీకు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎంత అల్లాడిపోయానో, ఆ రోజు లాబ్ లో మీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలు కోల్పోయిన పర్వాలేదు అనుకున్నాను ఇదంతా ప్రేమ్ కదా సార్? నాకు మిమ్మల్ని కొల్పోవలని లేదు,నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, నా ప్రేమ నీ స్వీకరించండి అని చెప్పి ఆ గిఫ్ట్ నీ రిషి కి ఇస్తుంది వసు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!