Rashmika Mandanna: ఇంటెన్స్ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న శ్రీవల్లి.. రష్మిక అరుదైన ఫోటోలు వైరల్‌..

Published : Aug 25, 2022, 07:27 AM ISTUpdated : Aug 25, 2022, 11:47 AM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇటీవల సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందాల ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకునే ఈ భామ ఇప్పుడు తన అరుదైన ఫోటోలతో ఫ్యాన్స్ ని సర్‌ ప్రైజ్‌ చేసింది.   

PREV
16
Rashmika Mandanna: ఇంటెన్స్ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న శ్రీవల్లి.. రష్మిక అరుదైన ఫోటోలు వైరల్‌..

రష్మిక మందన్నా(Rashmika Mandanna) లేటెస్ట్  గా తన అరుదైన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె చాలా ఇంటెన్స్ లుక్‌లో ఉండటం విశేషం. అంతేకాదు నటి అనే విషయాన్ని పక్కన పెడితే తానేంటో ఈ  చిత్రాలు తెలియజేస్తున్నాయని తెలిపింది రష్మిక మందన్నా. ఇందులో ఆమె లుక్స్ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. 

26

ఈ నాలుగు ఫోటోల్లో మొదటిది.. చేతిలో కాఫీ కప్‌ పట్టుకుని తన కిటికీలోనుంచి సూర్య కిరణాలు పడుతుండగా,  వాటి వేడికి తన్మయత్వం చెందుతూ కనిపించింది రష్మిక మందన్నా. ఇందులో  ఆమె లోలోపల ఆనందిస్తుండటం విశేషం. 

36

రెండో ఫోటోలో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుంది  రష్మిక మందన్నా. కెరీర్‌ బిగినింగ్‌లో తీసిన ఫోటో అని తెలుస్తుంది. అయితే ఈ ఫోటోలు ఎప్పుడు తీశారో గుర్తు రావడం లేదు. కానీ నటిగా  పక్కన పెడితే తనలోని ఒరిజినాలిటీ ఇదే అని చెప్పింది రష్మిక. 

46

మూడో ఫోటోలో కిచెన్‌లో కాఫీ  లేదా టీ చేస్తూ కనిపించింది. తన పని తానే చేసుకుంటాననే కోణాన్ని ఆవిష్కరించింది. ఈ చిత్రాలు వేల మాటలను చెబుతున్నాయని పేర్కొంది. ఈ ఫోటోలు ఎప్పుడు తీసుకున్నాననే విషయం గుర్తు రావడం లేదుగానీ,  అప్పటి  అనుభూతి మాత్రం  కళ్లముందు కదలాడుతుంది. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది అని చెప్పింది. 
 

56

మరో ఫోటోలో స్ట్రెయిట్‌గా  నిలబడి, తుపాకి ఎత్తిపెట్టినట్టుగా పోజులివ్వడం విశేషం. ఈ ఫోటోలపై రష్మిక ఇంకా స్పందిస్తూ, ఇదే నా చిన్న ప్రపంచమని, ఇవీ తనని చాలా ప్రశాంతతకి గురి చేస్తుందని, ఈ ఫోటోలను చూస్తుంటే వింతగా అనిపిస్తుందని,  కానీ ఇవంటే  తనకు ఎంతో ఇష్టమని చెప్పింది రష్మిక మందన్నా. 

66

`పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన రష్మిక మందన్నా.. ఇప్పుడు వరుసగా భారీ చిత్రాల్లో భాగమవుతుంది. ఆమె `పుష్ప 2`లో హీరోయిన్‌గా మెరవనుంది. మరోవైపు హిందీలోనూ భారీ చిత్రాల్లో నటిస్తుందీ నేషనల్‌ క్రష్‌. రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌`, అమితాబ్‌ తో `గుడ్‌ బై`, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్‌ మజ్ను` సినిమాలు చేస్తుంది.  దీంతోపాటు తమిళంలో విజయ్‌ తో `వారసుడు`లో మెరుస్తుంది రష్మిక.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories