వాస్తు మార్పులు అల్లు అర్జున్ కెరీర్ కు సాయిం చేసాయా? నిజమెంత

First Published | Nov 23, 2024, 3:44 PM IST

పుష్ప 2 విడుదలకు ముందు అల్లు అర్జున్ ఇంటి వాస్తు మార్పుల గురించి చర్చ జరుగుతోంది. బద్రీనాథ్ సినిమా ప్లాప్ తర్వాత వాస్తు మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప2 కబుర్లే. అల్లు అర్జున్ హవా దేశం మొత్తం వీస్తోంది.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ప 2 ది రూల్. మూడేళ్ల క్రితం రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప ది రైజ్ సినిమాకు ఇది సీక్వెల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇండియాస్‌ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ కు చెందిన పాత, కొత్త విషయాలు తవ్వి బయిటపోస్తున్నారు సోషల్ మీడియా జనం.

Pushpa 2 to Robin Hood: South Indian Films Releasing in December 2024

 
అలా బయిటకు వచ్చిన విషయాల్లో అల్లు అర్జున్ ..వాస్తు విషయం ఒకటి. తాము అనుకున్న పనులు జరగకపోతే మామూలు వాళ్లకే కాదు సినిమావాళ్లకు ఇంటి సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. ఇలా చాలామంది చేసినవారే.  తమ కెరీర్ స్లంప్ లో ఉన్నప్పుడు సినిమా స్టార్స్, డైరక్టర్స్ ఇంటి వాస్తును రకరకాలుగా మారుస్తూ వస్తూంటారు. అందులో వింతేమీ లేదు కూడా. అల్లు అర్జున్ ఏమో కానీ అల్లు అరవింద్ కు మాత్రం వాస్తు నమ్మకాలు ఉన్నాయని చెప్తారు.


Pushpa 2


అప్పట్లో బద్రీనాథ్ ప్లాఫ్ అయ్యినప్పుడు శ్రీహరి ఇంటికి దగ్గరలో ఉన్న గీతా ఆఫీస్‌ కార్యాలయానికి కొద్దిగా మార్పులు చేశాడు. ఆ తర్వాత  ఇంటిని వాస్తుకు అనుగుణంగా మార్పులు చేసారని చెప్పుకున్నారు. మగధీరలా... బద్రినాథ్‌ అల్లు అర్జున్‌కు ఎందుకు సక్సెస్‌ కాలేదనే ఆలోచనతో అప్పట్లో ఈ మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి.

వాస్తు నిపుణుల సలహా మేరకు కొద్దిగా ఇంటి ముఖ ద్వారం.. గార్డెన్‌, సెక్యూరిటీ పరిసరాల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మార్పులు చేసిన ఫలితమో ఏమో గానీ.... అప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు బద్రీనాథ్ లా ఎప్పుడు డిజాస్టర్స్ అవ్వలేదు. టాక్ బాగోలేదు అనుకున్న సినిమాలు సైతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తెచ్చి పెట్టాయి. 

pushpa 2


అల్లు అర్జున్ ది బద్రీనాథ్ ఫ్లాప్ కావటంతో అది వాస్తు సమస్యే అని , యన సూచన మేరకు ఈ మార్పులు చేయిస్తున్నట్లు చెప్పుకున్నారు. జూబ్లిహిల్స్ లోని వారి ఇంటిపై వాటాలో అల్లు అర్జున్ గదిని మార్పులు చేస్తున్నారని రాసుకొచ్చారు. అయితే ఆ ఫ్యామిలీకి చెందినవారు మాత్రం దీన్ని ఖండించారు. టాప్ ఫ్లోర్ లోని అల్లు అర్జున్ రూమ్ ని ఎక్సపేండ్ చేస్తున్నాము అంతేగానీ... వాస్తు మార్పులు చేయటం లేదు అన్నారు. వివాహం కావటంతో మరింత ప్లేస్ కావాలనే ఈ మార్పులు అని చెప్పారు. సినిమా కోట్లతో కూడిన వ్యాపారం కాబట్టి ఇలాంటివన్నీ మామూలే అని సరిపెట్టుకున్నారు. అవన్నీ  ప్రక్కన పెడితే బన్నీ బాగా కష్టపడే నటుడు. నేషనల్ అవార్డ్ సైతం అవలీలగా సాధించాడు. 

పుష్ప2 విషయానికి వస్తే.. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు మేకర్స్. ఇటీవలే బిహార్ వేదికగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ తో పాటు ట్రైలర్‌‌తో పుష్ప 2 సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగింది.

అయితే ఎప్పట్లాగానే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై ఏదో ఒక ప్రచారం వినిపిస్తూనే ఉంది. అలా తాజాగా పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ తప్పుడు ప్రచారంపై పుష్ప టీమ్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Allu Arjun, #Pushpa2, sukumar


పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను షేర్ చేసి.. ‘డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే’ అనే క్యాప్షన్ ఇచ్చారు. తద్వారా అనుకున్న తేదీకే అల్లు అర్జున్ మూవీ రానున్నట్లు పక్కా క్లారిటీ ఇచ్చేసింది. అంతకు ముందే డిసెంబర్ 04న USA ప్రీమియర్స్ పడతాయని మేకర్స్ తెలిపారు.

కాగా ‘పుష్ప’ మొదటి భాగం తర్వాత చాలా గ్యాప్ తర్వాత సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘పుష్ప 2’తో రాబోతున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇందులో స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఈ స్పెషల్ సాంగ్ ఆదివారం (నవంబర్ 24)న విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు.
 

Latest Videos

click me!