మంచు లక్ష్మీ చెయ్యాల్సిన రెండు సినిమాలు అనుష్కకు, రెండు బ్లాక్ బస్టర్లే

First Published | Nov 23, 2024, 3:26 PM IST

మంచు లక్ష్మికి మొదట అనుకున్న రెండు సినిమాలు కారణాల వల్ల అనుష్క శెట్టి దగ్గరకు వెళ్లి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అరుంధతి మరియు రుద్రమదేవి సినిమాలు మొదట లక్ష్మి కోసమే అనుకున్నారు.

Lakshmi Manchu, Anushka, arundhathi, rudhrama devi

ఇండస్ట్రీలో అనుకోనివి చాలా జరుగుతూంటాయి. మొదట స్క్రిప్టు రాసుకున్నప్పుడు అనుకున్న పాత్ర చివరకి వేరే హీరో, లేదా హీరోయిన్ దగ్గరకు వెళ్తూంటాయి. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. చాలా మంది హీరోలకు అలా జరుగుతూంటాయి.

బిజి షెడ్యూల్స్ వల్లో లేక స్క్రిప్టు ని సరిగ్గా అంచనా వేయలేకో లేక ఆ  పాత్ర తమకు సరపడదు అనుకునే వేరే వాళ్లను వరిస్తూంటాయి. అంతేకాకుండా బిజినెస్ లెక్కలతో కూడా పాత్రలు తారుమారు అవుతూంటాయి. అలా మంచు లక్ష్మి కెరీర్ లో రెండు సినిమాలు అనుష్క దగ్గరకు వెళ్లాయి. వెళ్లటమే కాకుండా అవి రెండు  పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి మంచి నటి. అలాగే ఆమె నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది. మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కు సినిమాల్లో సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి.

సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన ఆమె  గత కొంత కాలంగా వాటికి దూరంగా ఉంటోంది. పైగా తన నివాసాన్ని ముంబైకు షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా అక్కడే ఉంటోంది. 



అనుష్క విషయానికి వస్తే..డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో చేయకముందు ఒక రకమైన కెరీర్. ఆ తర్వాత నెక్ట్స్ లెవిల్ కు వెళ్లింది. బాహుబలిలో  యాక్ట్ చేసిన అనుష్క.. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌ హిట్‌తో.. సూపర్ స్టార్‌గా మారిపోయింది.

కానీ ఎందుకనో ఆ సినిమా తర్వాత సినిమాలను తగ్గించేంది. కానీ తన అభిమానులు కోసం చేస్తున్నట్లుగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా  ఎప్పుడూ ఏదో కారణంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది ఈ బ్యూటీ.  ఇప్పుడు ఆమె రెండు సినిమాలు చేస్తోంది.0


ఇంతకీ లక్ష్మీ మంచు నుంచి చేజారి అనుష్క దగ్గరకు చేరిన మొదటి సినిమా అరుంధతి.  అరుంధతి సినిమాకు మొదటి ఆప్షన్ మంచు లక్ష్మి. ఆ విషయాన్ని స్వయంగా కోడి రామకృష్ణే చెప్పారు. అయితే రకరకాల కారణాలతో ఆ ప్లేస్ లోకి అనుష్క వచ్చింది.

అనుష్కని అరుంధతి సినిమా ఎక్కడికో తీసుకెళ్లింది. తమిళ,తెలుగు సినిమాల్లో ఆమెను పూర్తి బిజి చేసింది. అందులో ఆమె నటించిన యోధురాలి పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అయితే మంచు లక్ష్మి చేసి ఉంటే ఆమె కెరిర్ కూడా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లేదనటంలో సందేహం లేదు.
 


ఇక రెండో సినిమా రుద్రమదేవి. మొదట దర్శకుడు గుణశేఖర్ .. 'రాణిరుద్రమ్మ'గా లక్ష్మీప్రసన్న ను అనుకున్నారు.  తెలుగులో తను నటిస్తూ, నిర్మిస్తున్న 'గుండెల్లో గోదావరి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న టైమ్ లో జరిగింది ఇది .

అప్పుడు మంచు లక్ష్మి వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఓ వైపు తమ్ముడు మనోజ్ హీరోగా, నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర చేస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం షూటింగ్ పూర్తయ్యే దిశలో ఉంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న 'కడల్' చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించింది లక్ష్మీప్రసన్న. ఈ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. 

మంచు లక్ష్మిపై బెజవాడ బేబక్క మాస్ పంచులు


అయితే అప్పుడే మరో మంచి అవకాశాన్ని అందుకోబోతోందనే వార్తలు మీడియాలో వచ్చాయి.  గుణశేఖర్ 'గోన గన్నారెడ్డి' అనే పీరియాడికల్ చిత్రం చేయడానికి సన్నాహాలు చేద్దామనుకున్నారు.  రాణి రుద్రమ్మ దగ్గర అత్యంత ముఖ్యమైన గూఢచారిగా -వ్యవహరించిన వ్యక్తి నిజ జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కాలి. ఇందులో రాణిరుద్రమ్మ పాత్రను లక్ష్మీప్రసన్నతో నటింపజేయాలని భావించాడట గుణశేఖర్.

నిజంగా ఇది లక్ష్మీప్రసన్నకు మంచి అవకాశమని చెప్పొచ్చు. నటిగా ఇన్ని అవకాశాలు చేజిక్కించుకున్న లక్ష్మీప్రసన్న కెరియర్ దాదాపు ఊపందుకున్నట్టేనని సినీ వర్గాలు భావించాయి. అయితే అనుకోని విధంగా కమర్షియల్ లెక్కలతో అనుష్క ఆ సినిమాలోకి వచ్చింది. ఆమె పేరుతోనే టైటిల్ పెట్టారు. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ని తీసుకున్నారు. ఆ విధంగా ఆ సినిమా మిస్సైంది. 

Latest Videos

click me!