ఎవరూ ఊహించని ఎలిమినేషన్, టాప్ 5 కంటెస్టెంట్ ఇంటికి, చివరి నిమిషంలో మారిన సమీకరణాలు

First Published | Nov 23, 2024, 3:22 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఎవరు ఊహించని ఎలిమినేషన్ చోటు చేసుకోనుందట. టాప్ 5లో ప్లేస్ గ్యారంటీ, ఫైనల్ లో ఉంటారనుకున్న కంటెస్టెంట్ ఇంటి బాట పట్టనున్నారట.  
 

 బిగ్ బాస్ షోలో మరొక ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ వారం నామినేషన్స్ భిన్నంగా నిర్వహించాడు బిగ్ బాస్. ఇదే సీజన్లో కంటెస్ట్ చేసి ఎలిమినేటైన ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్నారు. 
 

Bigg boss telugu 8

సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, ఆదిత్య ఓం, నైనిక, నాగ మణికంఠ, శేఖర్ బాషా, సీత హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. వీరు ఇంటి సభ్యుల గేమ్ ఆధారంగా నామినేట్ చేశారు. మెజారిటీ నామినేషన్స్ ప్రేరణ, నిఖిల్, యష్మిలకు పడ్డాయి. పృథ్విరాజ్, నబీల్ లను సైతం నామినేట్ చేశారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంటి నుండి వెళ్లిపోయారు. అనంతరం బిగ్ బాస్... యష్మి, నబీల్, పృథ్వి, నిఖిల్, ప్రేరణ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నట్లు తెలియజేశారు.


Bigg boss telugu 8

మంగళవారం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం అర్థరాత్రితో ముగిసింది. నామినేషన్స్ లిస్ట్ లో ఉన్న ఐదు మంది కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్. వీరు మొదటి వారం నుండి హౌస్లో ఉన్నవాళ్లు. దాంతో ఎలిమినేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం యష్మి ఎలిమినేట్ అయ్యిందట. ఆమె బిగ్ బాస్ ఇంటిని వీడటం దాదాపు ఖాయం అంటున్నారు. 
 

పృథ్విరాజ్, నబీల్ కంటే ఓటింగ్ లో యష్మి ముందు ఉన్నట్లు చాలా సర్వేలు చెప్పాయి. వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అంచనా వేశారు. అనూహ్యంగా యష్మి పేరు తెరపైకి వచ్చింది. యష్మిని నిఖిల్ దెబ్బ తీశాడు. మానసికంగా ఆమె క్రుంగి పోవడానికి కారణం అయ్యాడు. ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేట్ చేసే క్రమంలో చేసిన కామెంట్స్ యష్మిని మరింత బాధపెట్టాయి. 

నిఖిల్ తో తన రిలేషన్ చాలా డామేజ్ చేసింది. బయట బ్యాడ్ గా ప్రొజెక్ట్ అయ్యిందని యష్మికి అర్థమైంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యష్మి మూట ముల్లె సర్దుకోనుందట. ఫ్యామిలీ వీక్ లో హౌస్లోకి వచ్చిన యష్మి ఫాదర్ ఆమెకు హింట్ ఇచ్చాడు. గ్రూప్ గేమ్ ఆడకు అని చెప్పాడు. టాప్ 5 లో ఉండాల్సిన యష్మి మధ్యలోనే తన గేమ్ ముగిచింది. 

మరి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు యష్మి ఎలిమినేట్ అయితే... ఇంకా హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 5 మంది ఫైనల్ కి వెళతారు. ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఒక వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సీజన్ 7లో ఆరు మంది కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే అలా కూడా జరగొచ్చు. 

కాగా టైటిల్ ఫేవరేట్ పై ఇంకా స్పష్టత రాలేదు. నిఖిల్ ఒక విధంగా ముందంజలో ఉన్నాడు. ఈసారి గౌతమ్ టైటిల్ రేసులో నిలిచే ఛాన్స్ ఉంది. ప్రేరణ, రోహిణి, నబీల్ సైతం స్ట్రాంగ్ ప్లేయర్స్ గా ఉన్నారు. 

Latest Videos

click me!