లావణ్య త్రిపాఠి మళ్లీ సినిమాలు చేయడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమాలు చేయడానికి తాను రెడీగానే ఉందని తెలిపారు వరుణ్ తేజ్. అయితే గతంలో వచ్చిన సినిమాలు చేసింది. పాత్రకి ప్రయారిటీ ఉన్నా, లేకపోయినా చేసుకుంటూ వచ్చింది. ఆ జర్నీ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం తను కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు ఏది పడితే అది చేయాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం కథలు వింటుంది. త్వరలోనే సినిమాలు చేస్తుంది. మేం ఇద్దరం కూడా మంచి కథ వస్తే చేస్తాం. మంచి పాత్ర దొరికాలి. స్క్రిప్ట్ కుదరాలి. అప్పుడే చేస్తాం. అదే సమయంలో పెళ్లైయ్యాక సినిమాలు చేయకూడదనే మైండ్ సెట్‌లో ఎవరూ లేరు. ఇప్పుడు అంతా మారిపోయింది. పెళ్లాయ్యక కూడా సినిమాలు చేయోచ్చు. లావణ్య కూడా చేస్తుందని చెప్పారు వరుణ్ తేజ్.