VarunTej కెరీర్‌లో ఒక్క సక్సెస్‌ క్రెడిట్‌ లేదు.. అయినా రిస్క్.. తాడో పేడో తేలే సమయం?

First Published | Feb 27, 2024, 5:17 PM IST

వరుస పరాజయాలతో వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ కాస్త తడబాటుకు గురవుతుంది. ఇప్పుడు మరో రిస్క్ చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఆయన్ని టెన్షన్‌ పెడుతుంది. 

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `ఆపరేషన్‌ వాలెంటైన్` చిత్రంతో ఆడియెన్స్  ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠితో మ్యారేజ్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న మూవీ ఇది. హిందీ దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ రూపొందిస్తున్న మూవీ ఇది. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు. మొదటి సారి రాబోతుంది. ఆడియెన్స్ ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 
 

ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు తనది అని చెప్పుకునే హిట్‌ రాలేదు. ఆయనకు మూడు నాలుగు హిట్‌ సినిమాలు పడ్డాయి. కానీ హిట్‌ క్రెడిట్‌ మాత్రం వరుణ్‌కి దక్కలేదు. ఆయన మొదటగా నటించిన `ముకుందా` పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన `కంచె` కమర్షియల్‌గా ఆడలేదు. క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. కానీ ఆ క్రెడిట్‌ దర్శకుడు క్రిష్‌ జాబితాలోకి పోయింది. 
 


ఈ క్రమంలో `ఫిదా` పెద్ద హిట్ పడింది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్‌. కానీ హిట్‌ క్రెడిట్‌ మాత్రం వరుణ్‌ తేజ్‌ ఖాతాలోకి రాలేదు. ఇది సాయిపల్లవి తీసేసుకుంది. కొంత శేఖర్‌ కమ్ముల తీసుకున్నాడు. సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల వల్లే ఈ మూవీ ఆడిందన్నారు. 

ఇంకోవైపు `తొలి ప్రేమ` సినిమా చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్‌. ఈ సినిమా సమయంలోనూ వరుణ్‌ తేజ్‌ పేరు కంటే దర్శకుడి పేరు బాగా వినిపించింది. అలాగే రాశీఖన్నా పేరు వినపడింది. వీరి తర్వాతే వరుణ్‌ తేజ్‌ నిలిచాడు.
 

ఇక పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో `ఎఫ్‌2` ఒకటి. ఇందులో వెంకటేష్‌ మెయిన్‌ హీరోగా ఉన్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సినిమా హిట్‌ క్రెడిట్‌ మొత్తం వెంకీ ఖాతాలోకి పోయింది. అంతోకొంత అనిల్‌ రావిపూడికి దక్కింది. ఆ ఇద్దరే పంచుకున్నారు. గ్లామర్‌ సైడ్‌ తమన్నా తీసుకుంది. కొంత మెహరీన్‌ షేర్‌ చేసుకుంది. కానీ వరుణ్‌ తేజ్‌ ఐదో స్థానానికే పరిమితమయ్యాడు. `ఎఫ్‌3` కూడా అంతే. `గద్దల కొండ గణేష్‌` హరీష్‌ శంకర్‌ జాబితాలో చేరింది. వరుణ్‌ బాగా చేశాడని మాత్రమే అన్నారు. 
 

ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇది వరుణ్‌ తేజ్‌ సినిమా, ఇంత పెద్ద హిట్‌ అయ్యిందనేది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఇంకా ఎంత బ్యాడ్‌ లక్‌ అంటే డిజాస్టర్‌ అయిన  ప్రయోగాత్మక మూవీ `అంతరిక్షం` కూడా దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఖాతాలో పడింది. ఆయన దర్శకత్వం గురించే మాట్లాడుకున్నారు. ఇందులోనూ వరుణ్‌ తేజ్‌ పేరు మెయిన్‌గా వినిపించలేదు. 

ఇలా వరుణ్‌ తేజ్‌కి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అలా చెప్పుకునే వాళ్లు లేకపోవడంతో `గని`, `గాంఢీవదారి అర్జున` చిత్రాలు పోయాయి. ఇప్పుడు `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రం చేశాడు. పుల్వామా ఘటన ఆధారంగా తెరకెక్కిచిత్రమిది. ఇందులో ఎయిర్‌ ఫోర్స్ అధికారిగా వరుణ్‌ తేజ్‌ నటిస్తున్నారు. మనపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో, దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏం చేశారనేది కథ. తెలుగులో ఇలాంటి సినిమాలు రాలేదు. ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది ప్రశ్న. అసలే వరుణ్‌ తేజ్‌ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు. అలాంటి టైమ్‌లో ఇలాంటి ప్రయోగాత్మక మూవీ చేయడం రిస్క్ గా మారింది. 
 

అయితే ఈ మూవీ చేయడంపై, రిస్క్ తీసుకోవడంపై వరుణ్‌ తేజ్‌ స్పందించారు. సినిమా అంటేనే రిస్క్ అని, రిస్క్ లేకుండా ఏం చేయలేమని, ఇష్టపడే చేసినట్టు తెలిపారు. ఇందులో యాక్షన్‌ మాత్రమే కాదు, చాలా ఎమోషన్‌ ఉంటుందని, అలాగే దేశభక్తి ఉంటుంది, అది ఆడియెన్స్‌ కి ఆకట్టుకుంటుంది. అదే ఆడియెన్స్ ని సినిమాతో నడిపిస్తుందని తెలిపారు. ఇలాంటి రిస్క్ లు తీసుకోవడంలో తాను ముందుంటాను అని వెల్లడించారు. మరి సినిమా ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి. 

Latest Videos

click me!