గ్లామర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.
ఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది.
తాజాగా సోనాక్షి సిన్హా బ్లాక్ డ్రెస్ లో ట్రెండీ గా మెరుపులు మెరిపిస్తోంది. జాకెట్ ఓపెన్ చేసి స్టైలిష్ గా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించేలా ఉన్నాయి. వివిధ భంగిమల్లో సోనాక్షి అదరహో అనిపించేలా మెరుపులు మెరిపించింది.
సోనాక్షి సిన్హా లేటెస్ట్ గ్లామర్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. కసిగా చూస్తున్న చూపులతో సోనాక్షి కుర్రాళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది.
సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది. వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోనాక్షి అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు.
సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. దీనితో ఆమె పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది.
బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది.
సోనాక్షి రీసెంట్ గా దాహాడ్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించింది. పోలీస్ అధికారిగా సోనాక్షి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. సోనాక్షి సిన్హా లేడీ పోలీస్ అధికారిగా మాస్ గా నటించి మెప్పించింది.
ఇక ఈ సిరీస్ లో విలన్ గా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ విలక్షణ నటన అందించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.