డ్రగ్స్ కేసులో హరిహర వీరమల్లు డైరెక్టర్, ఎఫ్ఐఆర్ నమోదు.. ఆ హోటల్ లో అరగంట పాటు..

First Published | Feb 27, 2024, 3:14 PM IST

టాలీవుడ్ లో తరచుగా డ్రగ్స్ వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఎంతలా కుదిపేసిందో తెలిసిందే. ఇటీవలే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులందరికి ఊరట లభించింది.

టాలీవుడ్ లో తరచుగా డ్రగ్స్ వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఎంతలా కుదిపేసిందో తెలిసిందే. ఇటీవలే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులందరికి ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ డ్రగ్స్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. 

తాజాగా మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు అమ్మాయిలతో పాటు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


వీరిలో రాజకీయ నేతల కుమారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బిజెపి నేత కుమారుడు, వ్యాపారవేత్త కొడుకు ఉన్నారట. రాడిసన్ హోటల్ లో పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒక మోడల్, టాలీవుడ్ నిర్మాత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

మరో సంచలనం విషయం ఏంటంటే ఈ కేసులో హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు డైరెక్టర్ క్రిష్ పేరు కూడా వినిపిస్తోంది. క్రిష్ పేరుని పోలీసులు 8 వ నిందితుడిగా ఎఫ్ ఐఆర్ లో చేర్చినట్లు చెబుతున్నారు. హోటల్ లో పార్టీ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ క్రిష్ కూడా అరగంట పాటు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హోటల్ యజమానితో కూడా క్రిష్ మాట్లాడారట. 

ఈ వ్యవహారం పై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. తాను రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తన స్నేహితులని కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లు క్రిష్ పేర్కొన్నారు. తన డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో హోటల్ యజమాని వివేకానందతో కాసేపు మాట్లాడానని.. డ్రైవర్ రాగానే అక్కడికి నుంచి వెళ్లిపోయినట్లు క్రిష్ పేర్కొన్నారు. అంతే కాయాన్ని డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రిష్ తేల్చి చెప్పారు. 

పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐ ఆర్ లో క్రిష్ పేరు చేర్చారు. దీనితో క్రిష్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి.  మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 

Latest Videos

click me!