వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి విడిపోవడం పక్కా.. వేణు స్వామి జ్యోతిష్యం.. మెగా ఫ్యామిలీలోని అమ్మాయే కారణమా?

Published : Apr 23, 2024, 06:04 PM ISTUpdated : Apr 24, 2024, 03:03 PM IST

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి దాదాపు ఆరు ఏళ్లు ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. కానీ వీరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. విడిపోతారంటూ షాకిచ్చాడు.   

PREV
16
వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి విడిపోవడం పక్కా.. వేణు స్వామి జ్యోతిష్యం.. మెగా ఫ్యామిలీలోని అమ్మాయే కారణమా?

వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి.. సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ జోస్యం చెబుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. తను సెలబ్రిటీ అయిపోయాడు. ప్రభాస్‌ వంటి చాలా మంది సెలబ్రిటీల జాతకం చెప్పి షాకిస్తూ వచ్చారు. టాలీవుడ్‌ సెలబ్రిటీ జంట విడిపోతుందన్నారు. ప్రభాస్‌ జాతకం చెప్పి మరింత పాపులర్‌ అయ్యాడు. 
 

26

ఇప్పుడు మెగా ఫ్యామిలీపై పడ్డాడు. పెద్ద బాంబ్‌ పేల్చాడు వేణు స్వామి. పెళ్లై ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడు మెగా ఫ్యామిలీ విడిపోతుందంటూ కామెంట్‌ చేశాడు. కొత్తగా పెళ్లైన వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి విడిపోతారని, ఎక్కువ రోజులు కలిసి ఉండరంటూ నోరు పారేసుకున్నాడు. కొత్త జంటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

36

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల జాతకం ప్రకారం కలిసే అవకాశం లేదని, పెళ్లి యోగ్యం లేదని తెలిపారు. వాళ్లిద్దరు కలిసి ఉండటం పెద్దమిరాకిల్‌ అని వ్యాఖ్యానించాడు వేణు స్వామి. తాను ఇలా చెబుతున్నానని, అంతా నా మీద పడి ఏడుస్తుంటారని, విమర్శలు చేస్తుంటారని, కానీ తాను జాతకం ప్రకారమే చెబుతానని, వ్యక్తిగతంగా తనకు వారితో గొడవ లేదు, బంధుత్వం లేదన్నారు వేణుస్వామి. 
 

46

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల జాతకంలో గురుడు, శుక్రుడు నీచంగా ఉన్నాడని, వాళ్లు కలిసే అవకాశం లేదన్నారు. అంతేకాదు లావణ్య త్రిపాఠికి గురు దోషం, వరుణ్‌కి నాగదోషం ఉందన్నారు. దీనికితోడు నాగదోషం, కుజదోషం లావణ్యని వెంటాడుతుందని, ఇలాంటి దోషాల మధ్య ఈ ఇద్దరు కలిసి ఉండటం పెద్ద మిరాకిల్‌ అన్నారు. 

56

అయితే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణం బయటపెట్టాడు వేణుస్వామి. వీరిద్దరి ఫ్యామిలీలో ప్రముఖమైన లేడీ కారణంగా ఈ ఇద్దరి విడిపోతారని మరో షాకిచ్చాడు. తాను చెప్పింది నిజం అవుతుందని, కానీ కాస్త ఆలస్యం కావచ్చు అని చెప్పాడు వేణు స్వామి. దాదాపు మూడు నెలల క్రితం `క్యూబ్‌ టీవీ` యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ విషయాలను వెల్లడించారు. 
 

66

దాదాపు ఆరు ఏళ్లు ప్రేమించుకున్న వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి గతేడాది నవంబర్‌ 1న ఇటలీలో వివాహం చేసుకున్నారు. చాలా గ్రాండ్‌గా డెస్టినీ వెడ్డింగ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరికి వారు తమ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `మట్కా` చిత్రంలో నటిస్తున్నాడు. లావణ్య వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories