చిరు సతీమణి సురేఖ వద్ద 2 కోట్ల అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఇంకా ఎవరెవరి దగ్గర అంటే, మొత్తం చిట్టా ఇదే

First Published Apr 23, 2024, 5:47 PM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా ర్యాలీగా పవన్ వెంట వెళ్లారు. 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా ర్యాలీగా పవన్ వెంట వెళ్లారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఆదాయం, ఆస్తుల వివరాలు అందులో పొందుపరచాల్సి వచ్చింది. 

ఆదాయంతో పాటు ఆస్తుల వివరాలని కూడా పవన్ నామినేషన్ లో మెన్షన్ చేశారు. దీనితో పవన్ కళ్యాణ్ అప్పుల చిట్టా కూడా బయటకి వచ్చింది. గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ 114 కోట్లు ఆదాయం పొందారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న లోన్లతో కలిపి 64 కోట్లపైగా అప్పు ఉన్నారు. 

వీటిలో కొందరు వ్యక్తుల వద్ద పవన్ కళ్యాణ్ చేసిన అప్పు 47 కోట్ల వరకు ఉంది. ఆశ్చర్య కరంగా పవన్ కళ్యాణ్ తన వదిన, మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ దగ్గర కూడా రూ.2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఇటీవల చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం అందించిన సంగతి తెలిసిందే. 

ఇది పక్కన పడితే తన వదిన దగ్గర కూడా పవన్ కళ్యాణ్ అప్పు చేశారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ ని తల్లిలా భావించడం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన వారిలో సురేఖ కూడా అని పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు తెలిపారు. 

సురేఖ తో పాటు పవన్ కళ్యాణ్ హారిక అండ్ హాసిని సంస్థకి 6 కోట్ల బకాయిలు ఉన్నారు. నిర్మాత నవీన్ యర్నేని, మైత్రి మూవీ మేకర్స్ కి కలిపి పవన్ 8 కోట్లకి పైగా అప్పు ఉన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి కూడా పవన్ కళ్యాణ్ 10 లక్షలు అప్పు ఉన్నట్లు నామినేషన్ లో పొందుపరిచారు. 

అదే విధంగా పవన్ కళ్యాణ్ ట్యాక్సుల రూపంలో 70 కోట్ల వరకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న సినిమాలన్నింటిని హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. 

click me!