దటీజ్ మెగాస్టార్.. డ్యాన్స్ మాస్టర్ లేరు, చైల్డ్ ఆర్టిస్ట్ తో కలసి కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి

First Published | Sep 26, 2024, 10:47 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లో తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. 156 చిత్రాల్లో చిరంజీవి 537 పాటలకు 24 వేలకి పైగా స్టెప్పులు వేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ చిరంజీవిని గుర్తించింది. 

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లో తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. 156 చిత్రాల్లో చిరంజీవి 537 పాటలకు 24 వేలకి పైగా స్టెప్పులు వేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ చిరంజీవిని గుర్తించింది. దీనితో చిరంజీవి డ్యాన్సులు మరోసారి చర్చనీయాశం అయ్యాయి. 

కెరీర్ బిగినింగ్ లో ఒక వైపు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే చిరంజీవి డ్యాన్సులు చేసేవారట. చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1979 నుంచి చిరంజీవికి హీరోగా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఆ ఏడాది తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన కోతల రాయుడు అనే చిత్రంలో చిరంజీవి హీరోగా నటించారు. 


ఈ చిత్రంలో ఒక నెలవంక చిరుగోరింక అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అందుకునే సమయంలో ఈ పాటని కూడా ప్రదర్శించారట. అందుకే అప్పటి సంఘటన గుర్తుకు వచ్చినట్లు తమ్మారెడ్డి తెలిపారు. 

ఒక నెలవంక సాంగ్ కి తారా మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి. కానీ ఆమెకి మరో షూటింగ్ ఉండడంతో వెళ్లిపోయారు. ఆ సాంగ్ చిరంజీవి, నటి తులసి పై ఉంటుంది. ఈ చిత్రంలో నటి తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తులసినే తర్వాత కాలంలో ప్రముఖ నటిగా మారింది. కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాల్లో నిఖిల్ తల్లిగా నటించింది ఆమెనే. కోతల రాయుడు చిత్రంలో ఆమెకి చిరంజీవి బాబాయ్ గా నటించారు. 

కొరియోగ్రాఫర్ లేకపోవడంతో చింరజీవి అప్పటికప్పుడు తులసితో కలసి కొరియోగ్రఫీ చేశారట. ఆ సాంగ్ చాలా అందంగా వచ్చింది. చిరంజీవికి డ్యాన్స్ పై ఉన్న మక్కువ అది. సింపుల్ స్టెప్పులతో చిరంజీవి ఆ పాటకి కొరియోగ్రఫీ చేశారు. అప్పటికి చిరంజీవికి ఇండస్ట్రీలో ఇంకా సరైన గుర్తింపు రాలేదు. 

Latest Videos

click me!