అన్నయ్య వరుణ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్... నిహారిక రియాక్షన్ ఇదే!

Published : Jun 10, 2023, 01:07 PM IST

హైదరాబాద్ వేదికగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ముగిసింది. లావణ్య వదినగా రావడంపై నిహారిక తన ఫీలింగ్ తెలియజేసింది.   

PREV
15
అన్నయ్య వరుణ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్... నిహారిక రియాక్షన్ ఇదే!
Varun Tej - Lavanya Tripathi engagement

కొన్నాళ్లుగా అనేక ఊహాగానాలు, సందేహాలు చక్కర్లు కొట్టాయి. వాటికి చెక్ పెడుతూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో జూన్ 9 రాత్రి వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

25

చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. చిత్ర ప్రముఖులకు ఎలాంటి పిలుపు లేదు. పెళ్లి మాత్రం చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా చేసుకోనున్నారట.

35
Varun Tej - Lavanya Tripathi engagement


కుటుంబ సభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక సైతం హాజరయ్యారు. ఆమె వదిన లావణ్య, అన్నయ్య వరుణ్ తో ఫోటోలకు ఫోజిచ్చారు. వరుణ్, లావణ్యలతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిహారిక ఓ కామెంట్ చేశారు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. 
 

45
Varun Tej - Lavanya Tripathi engagement


వరుణ్-లావణ్యల పెళ్లి నిహారికకు ఇష్టమే అని ఆమె కామెంట్ తో అర్థం అవుతుంది. కాబట్టి లావణ్యను వదినగా నిహారిక మనస్ఫూర్తిగా అంగీకరించారు. వరుణ్-లావణ్య రిలేషన్ లో ఉన్నట్లు నిహారికకు ముందే తెలుసు. ఇటీవల ఆమె నటించిన డెడ్ ఫిక్సెల్స్ సిరీస్ విడుదలైంది. అప్పుడు మీడియా నిహారికను వరుణ్-లావణ్యల పెళ్లి గురించి అడగ్గా ఆమె మాట దాటవేశారు. 
 

55


మరోవైపు నాగబాబు-నిహారిక దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. భర్త వెంకట చైతన్యతో నిహారిక విడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తండ్రీ కూతుళ్ళ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన వినిపిస్తోంది. ఇక వరుణ్ ఎంగేజ్మెంట్ కి కూడా వెంకట చైతన్య హాజరు కాలేదు. దీంతో నిహారికతో ఆయన విడాకులు లాంఛనమే అంటున్నారు. 

click me!

Recommended Stories