సెట్ లో అడుగుపెట్టాక తన వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోతానని, సెట్స్ నుంచి బయటికి వచ్చాక వృత్తి గురించి ఆలోచించనని చెప్పారు. అందుకే సాయిపల్లవి ఎప్పుడూ కూల్ గా, కాన్ఫిడెంట్ గా కనిపించేందుకు దోహదపడుతుందని అర్థమవుతోంది. గతేడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం శివ కార్తీకేయన్ 21లో నటిస్తోంది. ఇక తాజాగా వెకేషన్ లో ఈ ముద్దుగ్మమ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దర్శనమిచ్చింది. కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది.