అవినాష్, రోహిణి ఇకనైనా ముసుగు తొలగించండి.. హౌస్ నుంచి బయటకి వెళుతూ హరితేజ సంచలనం 

First Published | Nov 10, 2024, 10:50 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 70 వ రోజు చాలా సరదాగా సాగింది. సండే కావడంతో హౌస్ మేట్స్ అంతా అమ్మాయిలు అబ్బాయిలుగా.. అబ్బాయిలు అమ్మాయిలుగా గెటప్పులు మార్చుకుని కనిపించారు. అందరూ బాగా నవ్వించారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 70 వ రోజు చాలా సరదాగా సాగింది. సండే కావడంతో హౌస్ మేట్స్ అంతా అమ్మాయిలు అబ్బాయిలుగా.. అబ్బాయిలు అమ్మాయిలుగా గెటప్పులు మార్చుకుని కనిపించారు. అందరూ బాగా నవ్వించారు. ముఖ్యంగా అవినాష్ లేడీ గెటప్ లో నవ్వులు పూయించారు. సండే ఎపిసోడ్ కావడంతో నామినేషన్స్ లో ఉన్న వారు ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కూడా కొనసాగింది. 

పృథ్వీ , ప్రేరణ, యాష్మి, విష్ణు, నిఖిల్ , గౌతమ్, హరితేజ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. దీనితో ముందుగా నాగార్జున ఇద్దరినీ సేఫ్ చేశారు. ప్రేరణ, గౌతమ్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఇంతలో మట్కా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున వరుణ్ తేజ్ ని మట్కా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్ కూడా చూశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. 


హౌస్ మేట్స్ చేసిన డ్యాన్స్ ని వరుణ్ ఎంజాయ్ చేశారు. అవినాష్, టేస్టీ తేజ డ్యాన్స్ కి వరుణ్ తేజ్ పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత ఎలిమినేషన్ విషయంలో ఉత్కంఠ పెరిగింది. నిఖిల్, విష్ణుప్రియ సేఫ్ అవుతూ వచ్చారు. చివరికి నామినేషన్స్ లో హరితేజ, యష్మి మిగిలారు. నాగార్జున ఇద్దరినీ బాక్స్ లోపల చేయి పెట్టమన్నారు. గ్రీన్ కలర్ చేతికి అంటుకుంటే సేఫ్.. రెడ్ కలర్ అంటుకుంటే ఎలిమినేట్ అయినట్లు. 

బాక్స్ లోనుంచి ఇద్దరూ చేతులు బయటకి తీశారు. హరితేజ చేతికి రెడ్ కలర్ అంటుకుంది. దీనితో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇంటి సభ్యులు ఎమోషనల్ గా ఆమెకి సెండాఫ్ ఇచ్చారు. ముఖ్యంగా విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. హరితేజ వేదికపైకి వెళ్ళాక తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఆమెకి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ముసుగు తీసి గేమ్ ఆడాల్సిన వ్యక్తులు ఎవరో ఐదుగురి పేర్లు చెప్పాలి అని అడిగారు. 

దీనితో హరితేజ.. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, ప్రేరణ, నిఖిల్ పేర్లు చెప్పింది. అవినాష్ ఎంటర్టైన్ చేస్తాడు కానీ అతడి నిజస్వరూపం తెలియదు. ముసుగు తీయాల్సిన టైం వచ్చింది అని చెప్పింది. రోహిణి కూడా అంతే..ఏదో దాచుకుని గేమ్ ఆడుతోంది. ఇక టేస్టీ తేజ రూల్స్ చెబుతాడు కానీ పాటించడు అని విమర్శించింది. నిఖిల్, ప్రేరణ కూడా కొన్ని ఎమోషన్స్ చూపించాలి కొన్ని కంట్రోల్ చేసుకోవాలి అని హరితేజ సూచించింది. 

Latest Videos

click me!