మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథుల సమక్షంలో హిందూ సంప్రదాయాల పద్ధతితో టాలీవుడ్ స్టార్స్ ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుకతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
వెడ్డింగ్ డెస్టినేషన్ ఇటలీలోని టుస్కానీ నగరంలో వీరి పెళ్లి జరిగింది. నిన్న (నవంబర్ 1) మధ్యాహ్నాం దివ్యమైన ముహార్తానికి లావణ్య మేడలో వరుణ్ తాళి కట్టారు. అనంతర కార్యక్రమాలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియా మొత్తం వరుణ్ లావణ్య పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి.
ఇక పెళ్లి ముగిసిన తర్వాత కొత్త జంట పెళ్లి దుస్తుల్లోనే ఫొటోషూట్ చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను వరుణ్ తేజ్, లావణ్య తమ సోషల్ మీడియా అధికారిక అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బ్యూటీఫుల్ స్టిల్స్ తో ఆకట్టుకున్నాయి.
క్రీమ్ కలర్ పట్టు వస్త్రాల్లో వరుణ్ తేజ్, రెడ్ శారీలో పెళ్లి పీటలపై కూర్చున్నారు. ఇక ఆ దుస్తుల్లోనే ఫొటోషూట్ చేశారు. వరుణ్ తేజ్ ఒడిలో లావణ్య కూర్చున్న స్టిల్, చేతిచేయి వేసి నూతన బంధానికి ఆహానం పలుకుతున్నట్టుగా, స్నేహపూర్వక జర్నీని ప్రారంభించినట్టుగా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వరుణ్ తేజ్ - లావణ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెడ్డింగ్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.
నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉండటంతో తిరిగి నూతన వధూవరులతో కలిసి మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ తిరిగి రానుంది. మరుపెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చూడనున్నారు. రిసెప్షన్ ను కూడా చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇక వెడ్డింగ్ కు చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్, నితిన్ తదితరులు హాజరయ్యారు.