అయితే ఈ పెళ్ళి డ్రెస్ కోసం వారు లక్షల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరి పెళ్ళి బట్టలు దాదాపు 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఈ వెడ్డింగ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నితిన్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు.