లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ రింగ్ కాస్ట్.. ఎన్ని లక్షలంటే?

First Published | Jun 15, 2023, 2:15 PM IST

టాలీవుడ్ కొత్త జంటగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మారిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  - బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  ఎట్టకేళలకు ఒకటి కాబోతున్నారు. జూన్ 9న వీరి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ సభ్యులంతా వీరిని బ్లేస్ చేశారు. 
 

మెగా ఇంట పెళ్లి సందడి ప్రారంభం కావడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ - లావణ్య నిశ్చితార్థం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిశ్చితార్థపు వేడుకను కూడా చాలా గ్రాండ్ నిర్వహించారు. 
 


రాయల్ వెడ్డింగ్ లో వరుణ్ తేజ్ - లావణ్య బ్యూటీఫుల్ లుక్ లో మెరిశారు. అయితే స్టార్స్ పెళ్లి వేడుకల్లో ఏదో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా వారి వెడ్డింగ్ అరెంజ్ మెంట్స్,, దుస్తులు తదితర విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలో వీరి ఎంగేజ్ మెంట్ తర్వాత ఓ న్యూస్ వైరల్ గా మారింది.
 

ఇప్పటికే లావణ్య కట్టుకున్న పట్టుచీర ధర రూ.75 వేల వరకు ఉంటుందని టాక్. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ రింగ్స్ ధర కూడా హాట్ టాపిక్ గ్గా మారింది. వేడుకలో వీరు మార్చుకున్న రింగ్స్  ఒక్కటి రూ.25 లక్షల వరకు ఖరీదు ఉంటుందని తెలుస్తోంది. క్లాస్టీ రింగ్స్ తో ఎంగేజ్ మెంట్ జరగడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
 

ఇక వరుణ్ - లావణ్యల ఎంగేజ్ మెంట్ పూర్తవడంతో పెళ్లిపై ఆసక్తి నెలకొంది. వీరి ఇద్దరూ కలిసిన చోటే, వీరి ప్రేమకు పునాది పడ్డ చోటు ఇటలీలో వివాహా వేడుక జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి మరింత గ్రాండ్ గా ఏర్పాట్లు చేయబోతున్నారని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంట. 
 

ప్రస్తుతం వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గాండీవధారి అర్జున’లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకుడు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు లావణ్య తమిళంలో ‘తనాల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తర్వాత పెళ్లి వేడుక జరగనుందని అంటున్నారు. 
 

Latest Videos

click me!