గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న వరుణ్ సందేశ్ వైఫ్ వితిక.. క్రేజీ పిక్స్ వైరల్ 

First Published Apr 13, 2024, 1:11 PM IST

వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరు ఇటీవల ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా వితిక అందమైన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరు ఇటీవల ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా వితిక అందమైన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

వరుణ్ సందేశ్ సతీమణి, నటి వితిక షెరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ వితికా షెరు తన స్నేహితులతో సందడి చేస్తోంది. తరచుగా వితిక సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

ట్రెండీ అనిపించే బట్టల్లో వితిక చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ వాటర్ ఫాల్స్, అందమైన ప్రకృతి అందాలలో వితిక తన ఫ్రెండ్స్ తో కలసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు ఆ మధ్యన వైరల్ అయ్యాయి. 

వితికకి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో మెగా డాటర్ నిహారిక వితికకి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ వెకేషన్స్ లో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. 

తాజాగా వితిక షెరు ఎంతో అందంగా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. గ్లామర్ లుక్ లో వెలిగిపోతూ ఫోజులు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ తలెత్తుకుని ఉండేలా ప్రతి విషయంలో రాణించాలని కామెంట్ పెట్టింది. 

వితిక ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. దీనితో నెటిజన్లు హార్ట్ సింబల్ తో రియాక్షన్ తెలుపుతున్నారు. అయితే వితిక షెరు ని కొందరు ఆకతాయిలు తరచుగా ట్రోల్ చేస్తున్నారు. 

గతంలో తాను పొట్టి బట్టలు ధరించడం వల్ల వచ్చిన విమర్శలపై వితిక ఘాటుగానే స్పందించింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో ఉన్నాం. చీరకట్టుకుని స్విమ్మింగ్ చేయలేము కదా.. స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ ధరించాలి. సందర్భాన్ని బట్టి కంఫర్ట్ ని బట్టి బట్టలు వేసుకోవడం లో తప్పులేదు అని బదులిచ్చింది. 

click me!