‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ కలెక్షన్స్,ఎంతొస్తే బ్రేక్ ఈవెన్?

First Published Apr 13, 2024, 1:02 PM IST

హిట్ టాక్ వస్తే ఈవినింగ్ షోలకు వెళ్దామని ఫిక్సైన వారు రివ్యూలు, టాక్  చూసి ఆగిపోయారంటున్నారు. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాని జనం లేక కాన్సిల్ చేసారని చెప్తున్నారు. 

Geetanjali Malli Vachindi


సీక్వెల్ గా వచ్చిన ప్రతీ సినిమా వర్కవుట్ అవుతుందనే నమ్మకం లేదు. అయితే అవి రిలీజ్ కు ముందు మంచి బిజినెస్ చేస్తాయి. జనాలకు సినిమాపై పెద్దగా పబ్లిసిటీ లేకుండానే క్రేజ్, క్యూరియాసిటి కలగ చేస్తాయి. అయితే రిలీజ్ అయ్యాక అదే కంటిన్యూ అవుతుందని చెప్పలేం.  2014 లో అంజలి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi)  అనే మూవీ రూపొందింది. శివ తుర్లపాటి దర్శతక్వంలో ‘ఎం.వి.వి సినిమాస్‌’తో కలిసి ‘కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌’ పై కోన వెంకట్ (Kona Venkat)  ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి కెరీర్లో ఇది 50వ సినిమా కావటంతో ప్రమోషన్స్  బాగానే చేశారు. ఈ నేపధ్యంలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Geethanjali Malli Vachindi


ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ... ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’చిత్రం ఓపినింగ్స్ అనుకున్న స్దాయిలో డీసెంట్ గా తెచ్చుకోలేక పోయింది. రెండు రోజుల్లో కోటి రూపాయల మార్క్ కూడా టచ్ చేయలేదని చెప్తున్నారు. కేవలం 70,80 లక్షలు మాత్రమే రెండు రోజుల్లో రావటంతో ఇండస్ట్రీ పెద్దలు సైతం షాక్ అవుతున్నారు. 2014 లో గీతాంజిలి పెద్ద హిట్. ఆ సినిమా మొదట పెద్దగా లేకపోయినా మెల్లిగా ఎక్కేసింది. సెన్సేషన్ హిట్ అయ్యింది. అయితే అలాంటి కథతోనే, అదే పాత్రలను కంటిన్యూ చేస్తూ చేసిన సినిమాపై మంచి అంచనాలు ఉన్నా ఓపినింగ్స్ రాలేదు. హిట్ టాక్ వస్తే ఈవినింగ్ షోలకు వెళ్దామని ఫిక్సైన వారు రివ్యూలు, టాక్  చూసి ఆగిపోయారంటున్నారు. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాని జనం లేక కాన్సిల్ చేసారని చెప్తున్నారు. 

Geethanjali Malli Vachindi


‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టుకోవాల్సి ఉంది.  ఈ మధ్యకాలంలో సరైన హర్రర్ కామెడీ సినిమా ఏమి రాకపోవడం కొంతలో కొంత ప్లస్ అయ్యిందంటున్నారు. కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో   పర్వాలేదు అనిపించేలా సినిమా కి జనాలు థియేటర్స్  లో కనపడుతున్నారు.   మౌత్ టాక్ పెరిగితే.. ఇంకా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంటోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకొనే అవకాశం ఉందని చెప్తున్నారు.  

Geethanjali Malli Vachindi

కోన వెంకట్‌ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్‌బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్‌ కావాలని భగవంతుడిని వేడుకున్నాను. సక్సెస్‌ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్‌ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్‌లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు.


పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్‌లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్‌తో పాటు ఎమోషన్స్‌ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్‌ మిస్‌ అయింది. కేవలం కామెడీ, హారర్‌ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్‌ చేయకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.

click me!