జాన్వీ కపూర్ తో అలా చేసినందుకు.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ పై నెటిజన్ల ఫైర్.. వైరల్ గా మారిన పిక్స్

First Published | Jul 20, 2023, 9:36 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ - జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్, రొమాంటిక్ డ్రామా ‘బావల్’ (Bawaal). చిత్రంతో రేపు విడుదల కానుండగా.. తాజాగా వీరిద్దరూ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)  - జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బావల్’ (Bawaal). రొమాంటిక్ డ్రామా జోనర్ లో రూపుదిద్దుకుంది. నితేశ్ తివారి దర్శకత్వం వహించారు. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హద్దులు దాటి రొమాంటిక్ గా ఫొటోషూట్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు వరుణ్ ధావన్ పై మండిపడుతున్నారు. 


వరుణ్ ధావన్ కు 24 జనవరి 2021న, తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ (Natasha Dalal)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన తర్వాత కూడా కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం రొమాంటిక్ గా ఫొటోషూట్ చేయడం ఏం బాగాలేదని అభిప్రాయపడుతున్నారు. 

అటు వరుణ్, ఇటు జాన్వీ రెచ్చిపోయి ఫొటోలకు పోజులిచ్చారు. జాన్వీ వరుణ్ ఒడిలో పడుకోవడం, కౌగిలించుకోవడం పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్నాక కూడా ఇలాంటి ఫొటోషూట్లు చేయడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు. 

మరోవైపు కామెంట్స్ సెక్షన్‌ను పరిశీలిస్తే అభిమానులు కూడా లేటెస్ట్ ఫొటోషూట్ పై కాస్తా అభ్యంతరం తెలుపుతున్నారు. అలాంటి ఫోటోషూట్ అవసరమా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇన్నర్‌వేర్ బ్రాండ్‌కు నటుడు బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి ఫొటోషూట్ అవసరమా అని అభిప్రాయ పడుతున్నారు. 

మరికొందరు మాత్రం ’ఇది మాకు ఇష్టం లేదు‘.. ’వరుణ్ ధావన్ లక్స్ కోజీని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది’ అంటూ కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్‌కు ఆ ఫొటోషూట్ ను ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెట్టడం గమనార్హం. దీనిపై మున్ముందు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Latest Videos

click me!