Karthika deepam: దీప బతికుందన్న నిజాన్ని బయటపెట్టిన వారణాసి...కోమా నుంచి బయటకు వచ్చిన వంటలక్క!

Published : Aug 15, 2022, 08:29 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 15వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

PREV
17
Karthika deepam: దీప బతికుందన్న నిజాన్ని బయటపెట్టిన వారణాసి...కోమా నుంచి బయటకు వచ్చిన వంటలక్క!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నిరూపం ప్రేమ్ తో, ఈ పెళ్లి అవ్వగానే అందరం కూర్చుని నీ సమస్య గురించి చర్చిద్దాం అని అంటాడు.అప్పుడు ప్రేమ్ మనసులో, నా బాధ ఈ పెళ్ళే కదరా! అని అనుకుంటాడు. ఈలోగా హిమ నిరూపం కి ఫోన్ చేసి గుడికి బయలుదేరుతున్నాము అని చెప్తుంది. అప్పుడు ప్రేమ్ మనసులో,హిమ నన్ను ఇష్టపడుతుందో లేదో నాకు చెప్పడం లేదు,కానీ సౌర్యకి నిరుపమ్ కి పెళ్లి చేయమంటుంది అసలు నేనేం చేయాలి? హిమ గురించి నిరూపమ్ కి చెప్పడం పద్ధతి కాదు.డైరెక్ట్ గా వెళ్లి అమ్మానాన్నలు చెప్పేస్తాను ఇంకా ఏం జరుగుతదో వాళ్లే చూసుకుంటారు అని అనుకుంటాడు.
 

27

 తర్వాత సీన్ లో సత్యం ఈ పెళ్లి అయిపోగానే ఇంక ప్రేమ్ కెరియర్ గురించి శ్రద్ధ చూపాలి అని స్వప్న తో అంటాడు. ఈ మధ్య ప్రేమ్ ఏదో బాధలో ఉంటున్నాడు అసలు ఏమవుతుందో తెలియట్లేదు అని స్వప్న అంటుంది. ఈలోగా ప్రేమ్ అక్కడికి వస్తాడు. నీ గురించే మాట్లాడుకుంటున్నాంరా ఎందుకిలా ఉన్నావు? ఏదైనా బాధలో ఉన్నావా? అని సత్యం అడుగుతాడు. అప్పుడు స్వప్న, ఇప్పుడే నేను శోభ విషయం నుంచి కోరుకుంటున్నాను ఇప్పుడే నాకు ఇంకేమి చెప్పొద్దు. ఈ పెళ్లయిపోగానే మనం చర్చిద్దాం దయచేసి పెళ్ళి వరకు ఏం మాట్లాడొద్దు. అయినా నీకేం కష్టాలు ఉంటాయి రా? అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

37

 ఆ తర్వాత సీన్ లో గుడిలో అందరూ దేవుడిని పూజించుకుంటారు. అప్పుడు సౌందర్య మనసులో, హిమ శౌర్య మళ్ళీ ఒకటవ్వాలి అని కోరుకుంటుంది. ఆనంద్ రావు, ఇల్లంతా ఎప్పుడు సంతోషాలతోనే ఉండాలని,  హిమ,బావ,శౌర్య ల పెళ్లి జరగాలని, శౌర్య, వాళ్ళ అమ్మానాన్నలు బలి తిరిగి రావాలని కోరుకుంటుంది. ఈ లోగ పూజారి వచ్చి మీరు తెలుసొచ్చారో తెలియక వచ్చేరో కాని ఇవి చాలా మంచి గడియలమ్మ అని అంటారు. అప్పుడు హిమ మనసులో, జరిగిన నిజమంతా సౌర్యకి ఇప్పుడే చెప్పేయాలి.ఇప్పుడు చెప్పకపోతే నేను ఇంకా అప్పటికి చెప్పలేను అని అనుకోని శౌర్యని పక్కకు తీసుకెళ్దాం అనుకుంటుంది. కానీ శౌర్య ఒప్పుకోదు.
 

47

హిమ అలా ఏడుస్తూ అడిగేసరికి పక్కకు వస్తుంది శౌర్య. సౌర్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వింటాను అని అంటుంది శౌర్య. అప్పుడు హిమ,అమ్మానాన్నలకి కార్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో వాళ్లు నన్ను కారులో నుంచి తోసేశారు.అప్పుడు వాళ్ళు నాతో మాట్లాడిన చివరి మాట సౌర్యని జాగ్రత్తగా చూసుకో అని. ఇన్నేళ్లుగా నేను నీకోసం చాలా ఎదురు చూశాను. ఇన్నేళ్ల తర్వాత తిరిగి నువ్వు కనిపించేసరికి నీకు బావ ఇష్టమని తెలిసింది. అందుకే నిన్ను బావని ఒకటి చేయడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను అని అనగా శౌర్య ఇవేవీ నమ్మదు.
 

57

 కట్టుకథలు చెప్పడం మనేయు అని అంటది. అప్పుడు హిమ నువేం చెప్తే నమ్ముతావు అని అనగా అమ్మానాన్న తిరిగి రమ్మను వాళ్ళు వచ్చి చెప్తేనే నమ్ముతాను అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు అని అడుగుతారు. ఈ లోగా వారనాసి ఆ గుడి దగ్గరకు వచ్చి సౌర్యమ్మ చెప్పింది నిజమే. వాళ్లు బతికే ఉన్నారు అని అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. సౌందర్య కి కన్నీళ్లు వచ్చేస్తాయి, బతికే ఉండడమేంటి?అసలు ఎక్కడున్నారు? అని అడగగా గతంలో జరిగిన విషయం గురించి చెప్తాడు వారణాసి. కొన్నేళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజులు తర్వాత హాస్పిటల్లో కోమా నుంచి బయటికి వస్తుంది దీప.
 

67

 బయటికి రాగానే డాక్టర్ బాబు! డాక్టర్ బాబు! అని అరుస్తూ ఉంటుంది. ఈ లోగా తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అక్కడికి వచ్చి నేనే డాక్టర్ బాబు ని అని అంటాడు. అప్పుడు దీప రూమ్ లో నుంచి బయటికి వచ్చి హాస్పిటల్లో అంత డాక్టర్ బాబు గురించి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ ఆ కారు లోయలో పడిపోయినప్పుడు అందులో ఇంకెవరైనా ఉన్నారా? వారి గురించి మీరు అడుగుతున్నారా? అని అంటాడు. అప్పుడు అవును అని అంటుంది దీప. ఆ కార్ లోయలో పడిపోయినప్పుడు మీరు  ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అక్కడ ఉన్నవాళ్లు ఇక్కడికి తీసుకువచ్చారు. మీ ఒక్కరిని మాత్రమే వారు చేర్పించారు.మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు దీప హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది.
 

77

 ఈ లోగ దీపకి శౌర్య,హిమలు గుర్తొచ్చి పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అని ఏడుస్తూ ఉంటుంది.అప్పుడు శౌర్య, వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏడుస్తూ, అసలు జీవితమంతా నేను అమ్మ దగ్గర,హిమ నాన్న దగ్గర ఉండి మేము కలవకపోయినా బాగున్ను ఇదంతా జరిగేది కాదు.అసలు మమ్మల్ని విడదీయడం కోసమే కలిపడా భగవంతుడు? అని ఏడుస్తూ ఉండగా శౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్ లు, మీ అమ్మ నాన్నల్ని తిరిగి తెలేము. కాని వాళ్లు నీ మీద చూపించినంత ప్రేమను చూపించగలము బాధపడొద్దు అని శౌర్య అని ఓదారుస్తారు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

click me!

Recommended Stories