Naa Saami Ranga OTT : ఏ ఓటీటీలో ‘నా సామిరంగ’ మూవీ.... రేటు, రిలీజ్ డేట్ ఇదే?

Published : Jan 14, 2024, 05:13 PM ISTUpdated : Jan 14, 2024, 05:16 PM IST

కింగ్, అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామిరంగ’ Naa Saami Ranga ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. ఈ క్రమంలో మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన డిటేయిల్స్ కూడా అందాయి. 

PREV
16
Naa Saami Ranga OTT : ఏ ఓటీటీలో ‘నా సామిరంగ’ మూవీ.... రేటు, రిలీజ్ డేట్ ఇదే?
Naa Saami Ranga

సీనియర్ హీరో, అక్కినేని నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఇది నాగ్ 99వ చిత్రం కావడం విశేషం. 
 

26
Naa Saami Ranga

కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా మారుతూ దర్శకత్వం వహించిన చిత్రమే ‘నా సామి రంగ’. ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ Ashika Ranganath నటించింది. మిర్నా మీనన్, రుక్సార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

36

నాగార్జునతో పాటు అల్లరి నరేష్, యంగ్ హీరో రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 
 

46

ప్రస్తుతం సంక్రాంతి సినిమాలు ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’ తోపాటు ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా బరిలోకి దిగింది. 2022లో ‘బంగార్రాజు’ సినిమాతో నాగ్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈసారి ఎలాంటి రిజల్ట్ రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 
 

56

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ‘నా సామిరంగ’ మూవీ ఓటీటీ డిటేయిల్స్ కూడా అందాయి. 
 

66

ఆ వివరాల ప్రకారం... ఫిబ్రవరి 3న ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని అంటున్నారు. లేదంటే ఫిబ్రవరిలో మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ హక్కులను ఈ సంస్థ రూ.18 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. 
 

click me!

Recommended Stories