నా కూతురు పెళ్లికి నన్ను పిలవలేదు, నటి వనితా విజయ్ కుమార్ ఆవేదన

Published : Feb 20, 2024, 11:29 AM IST

తమిళనటి వనితా విజయ్ కుమార్ సంచలన పోస్ట్ పెట్టారు. తన ఇంట్లో జరుగుతున్న పెళ్లికి తనను పిలవలేదంటూ ఆవేదన చెందింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 

PREV
17
నా కూతురు పెళ్లికి నన్ను పిలవలేదు, నటి వనితా విజయ్ కుమార్ ఆవేదన

స్టార్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కూతురు.. నటి వనిత విజయ్ కుమార్ కాంట్రవర్సీల చూట్టు తిరుగుతుంటారు. ఇప్పటికే మూడు పెళ్ళతో పాటు.. వివాదాస్పద వాఖ్యలతో పాపులర్ అయిన ఈ నటి.. తండ్రితో తగాదాల కారణంగా.. ఇంటి నుంచి గెంటివేయబడ్డారు. దాంతో కుటుంబానికి దూరంగా ఉంటుంది వనిత. కాగా తాజాగా విజయ్ కుమార్ ఫ్యామిలీలో జరిగిన పెళ్లికి తనను పిలవకపోవడంపై ఓ పోస్ట్ పెట్టింది సీనియర్ నటి. 

27
Vijayakumar and Family

నటుడు విజయకుమార్‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు ముత్తుకన్న. ఆయనకు ముగ్గురు పిల్లలు కవిత, అనిత, అరుణ్ విజయ్. రెండో భార్య పేరు మంజుల. సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ప్రీత, వనిత, శ్రీదేవి. కొన్నేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మంజుల మృతి చెందడంతో విజయకుమార్ ప్రస్తుతం మొదటి భార్య ముత్తుకన్నతో కలిసి జీవిస్తున్నాడు.

37
Anitha Vijayakumar

కుమార్తె అనితతో పాటు విజయకుమార్ కుటుంబం నుంచి ఐదుగురు స్టార్స్ వారి ప్యామిలీలో ఉన్నారు.  అరుణ్ విజయ్ ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. అలాగే ప్రీత, శ్రీదేవి, కవిత కూడా పెళ్లికి ముందు నటించారు. పెళ్లయ్యాక సినిమా రంగానికి దూరమయ్యారు. విజయకుమార్ మరో కూతురు వనిత ప్రస్తుతం నటిగా కొనసాగుతూనే ఉంది.  
 

47
Vanitha Vijayakumar

వనితా విజయ్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు జోవిక, జయనిక. ఆమె  మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కాని ఆ మూడు విఫలమయ్యాయి. ప్రస్తుతం వనిత తన కుమార్తెలతో ఒంటరిగా జీవిస్తోంది. విజయకుమార్‌తో గొడవపడిన ఆమెను  ఇంటి నుంచి గెంటేవేయడంతో కుటుంబానికి దూరంగా ఉంటుంది  వనిత.
 

57
Vijayakumar

 వనిత కూతురు జోవికా ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొంది. త్వరలో హీరోయిన్‌గా మారనుందని కోలీవుడ్ లోటాక్ నడుస్తోంది. ఇక రీసెంట్ గా విజయ్ కుమార్ ఇంట్లో పెళ్ళి సందడి జరిగింది. విజయ్ కుమార్ పెద్ద కూతురు అనితా విజయ్ కుమార్ కూతురు దియా పెళ్లి వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలకు తనకు పిలుపు లేకపోవడంపై వనిత విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  
 

67
Anitha Vijayakumar

విజయకుమార్ కూతురు అనిత కూతురు దియా వివాహం రీసెంట్ గా జరిగింది. దాంతో విజయ్ కుమార్ ఇంట్లో వరుస కార్యక్రమాలు జరిగాయి. మెహందీ, సంగీత్. హల్దీ, మంగళస్థానాలు, పెళ్ళి.. ఇలా అన్ని కార్యక్రమాలు ఘనంగా చేశారు. కాని కుటుంబం అంతా ఎంతో సంతోషంగా పాల్గొన్న ఈ వేడుకల్లో వనితను పిలవలేదు.
 

77

దియా పెళ్లికి తనను ఎవరూ ఆహ్వానించకపోవడంతో, వనిత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తనను తాను సింహంతో పోల్చుకున్న ఆమె..  తాను నడుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అంతే కాదు కుటుంబం నుంచి వేరయినా.. తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నట్టుగా ఆమె పోస్ట్ ఉంది. 
 

click me!

Recommended Stories